శనివారం, నవంబర్ 15, 2014

రసమంజరీ...

సింధుభైరవి సినిమాకోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో ఏసుదాస్ గారు పాడిన ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. ఏసుదాస్ గారూ ఇళయరాజా గారి కలయికలో వచ్చిన పాట గురించి నేను వ్యాఖ్యానించగలిగినంతటి వాడనా మీరే విని ఎంత బాగుందో తెలుసుకోండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సింధుభైరవి (1985)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : కె.జె.ఏసుదాస్

రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతి
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరి

రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతి
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరీ

స్వరమంగళ లలనా ఎద వీడగలనా
పరువాల స్మరణ
మరుజన్మం కరుణ
అను మెరుగుల దయచూడక
మనగలనా జ్వలనా
చెలి తపఃఫలం స్వయం సిద్ధం
చేకొన విడివడెనా
ముఖం దాచవలెనా... ఆ....
ముఖం దాచవలెనా
మృదుమధుర వదనా
నీ మోమందు పూర్ణేందు
ప్రభల్ కనగ
నా ఎడద సుఖానపడు

రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతీ
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరీ

రూపం కనుటకు తొందర తొలగెను
తొలుత తోచ పరిపాటి
గంగను తలనిడి పార్వతి సతియను
శివుని వీడు ఒక జాతి
రామయదొక విధి కృష్ణయదొక విధి
భువిని చూడ సమనీతి
అచ్చట కలిమికి ఇచ్చట చెలిమికి
ఎవరు ఎవరు సరిజోడి
కన్నీర్పెరిగినచో... ఆ... ఆ...
కన్నీర్పెరిగిన కన్నుల సుముఖం
చక్కగ కనబడు ద్విరూపం
చినుకా తొలకరి చినుకా
చిలకా చిక్కని చిలకా
జలజల వలవల వలచిన చెలుడిటు
నిలువున విలపిలె
బ్రతుకున అడుగిడు చెలువా


2 comments:

అద్యంతం హై పిచ్ లో సాగే పాట..సముద్రమెత్తున ఎగిసి పడే ఆనందపు భావావేశానికి అద్దమీ పాట వేణూజీ..

పాట గురించి చాలా అందంగా చెప్పారు.. థాంక్స్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.