గురువారం, అక్టోబర్ 16, 2014

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ...

దొంగలకు దొంగ సినిమా కోసం సత్యం గారి స్వరకల్పనలో గోపీ గారు రచించిన "ఒకటే కోరిక" అనే పాట ఈ రోజు మీకోసం. నలుగురిలో పాడుకోడానికి కాస్త ఇబ్బంది పెట్టే లిరిక్స్ అయినప్పటికీ ప్రేయసీ ప్రియులకి మాత్రం ఒక అందమైన పాట ఇది. సత్యం గారి సంగీతం కూడా ఆకట్టుకుంటుంది, చిత్రీకరణ చూస్తే ఏదైనా హిందీ పాట ప్రేరణేమో అనిపిస్తుంటుంది. ఇందులో కృష్ణగారి డాన్స్ వర్ణించడానికి మాటలు చాలవు చూసి తీరాల్సిందే :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దొంగలకు దొంగ(1977)
సంగీతం : సత్యం 
సాహిత్యం : మైలవరపు గోపీ 
గానం : బాలు, సుశీల

ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ
హహా..ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ
హహా..కరిగిపోవాలనీ

ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ
హాహా..ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ
హాహా..కరిగిపోవాలనీ హా..హా..

 
నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెనూ
కురులలో నీలి కనులలో నా హృదయమే చిక్కెనూ
నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవీ
నా పెదవులే నీ నామము పలవరిస్తున్నవీ
హే...కలలందూ కనులందూ కదలక నిలిచెను నీ సొగసూ

ఒకటే కోరిక హే..నిన్ను చేరాలనీ
హేహే..
ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ
హేహే..కరిగిపోవాలనీ హే..హే..

చేతికి చేయి తగిలితే గుబులు పుడుతున్నదీ
కొత్తగా నా వయసుకు దిగులు వేస్తున్నదీ
 
చెక్కిట ఆ నొక్కులు ఆశ పెడుతున్నవీ
ఆ ఒంపులు మేని బరువులు నను నిలువనీకున్నవి
హా..హహహా...
అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం
 
ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ
హహా..ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ
హహా..కరిగిపోవాలనీ


2 comments:

కృష్ణగారి డాన్స్ డ్రిల్ల్ పోశ్చర్స్ ని పోలివున్నా..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ శోభన్ ఫాన్స్..కృష్ణే అందగాడనిపిస్తుంది నాకు..

హహహ డ్రిల్ పోశ్చర్సా కెవ్వ్వ్ శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.