బుధవారం, అక్టోబర్ 01, 2014

మాణిక్య వీణా... శ్రీ శారదాంబా...

ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చే రోజు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూరకాయల పులుసు అన్నం సమర్పించాలని అంటారు. ఈ రోజు అక్షరజ్ఞానం లేని కాళిదాసును అనుగ్రహించిన ఆ వాగ్దేవి ఆతని నాలుకపై బీజాక్షరాలు వ్రాయగా అతను అమ్మను స్తుతిస్తూ రచించిన శ్యామలాదండకాన్ని గుర్తు చేసుకుందాం. మహాకవి కాళిదాసు సినిమాలోని ఈ సన్నివేశం ఎప్పుడు చూసినా నా తనువు రోమాంచితమౌతుంది. ఘంటసాల గారు గానం చేసిన తీరు నభూతో నభవిష్యత్ అన్నట్లుంటే అక్కినేని గారి నటన అందుకు దీటుగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : మహాకవి కాళిదాసు (1960)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : కాళిదాసు (శ్యామలా దండకం)
గానం : ఘంటసాల

మాణిక్య వీణాముపలాలయంతీం,
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, 
మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే, 
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే! జగదేక మాతః జగదేక మాతః ...ఆ...

మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!

జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీత రసికే!  జయ లీలా శుకప్రియే...!

జై జననీ!

సుధా సముద్రాంత ఋద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య
కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే...!  కృత్తివాసప్రియే...!
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ
చూళీ సనాథత్రికే! సానుమత్ పుత్రికే...!
శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ
నగ్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణి
శృంగారితే! లోకసంభావితే...!
కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా
పంకకేళీ - లలామాభిరామే...! సురామే! రమే...!
సర్వ యంత్రాత్మికే! సర్వ తంత్రాత్మికే!
సర్వ మంత్రాత్మికే! సర్వ ముద్రాత్మికే!
సర్వ శక్త్యాత్మికే! సర్వ చక్రాత్మికే!
సర్వ వర్ణాత్మికే! సర్వ రూపే!
జగన్మాతృకే! హే జగన్మాతృకే!
పాహి మాం పాహి మాం, పాహి పాహి!
 
మాణిక్య వీణా ముపలాలయంతీం,
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం,
మాతంగ కన్యాం మనసా స్మరామి

మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
జయ మాతంగతనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీతరసికే!  జయ లీలాశుకప్రియే...!

సర్వ యంత్రాత్మికే! సర్వ తంత్రాత్మికే!
సర్వ మంత్రాత్మికే! సర్వ ముద్రాత్మికే!
సర్వ శక్త్యాత్మికే! సర్వ చక్రాత్మికే!
సర్వ వర్ణాత్మికే! సర్వ రూపే!
జగన్మాతృకే! హే జగన్మాతృకే!
పాహి మాం పాహి మాం, పాహి పాహి!

~*~*~*~*~*~*~*~

అలాగే శ్రుతిలయలు సినిమాలో "శ్రీ శారదాంబా నమోస్తుతే" అంటూ సాగే ఈ పాటను కూడా తలచుకుందాం. ఈ పాట సాహిత్యం నాకు చాలా ఇష్టం అయితే ఇది సిరివెన్నెల గారు రాసిన పాటా లేకా ఏదేనీ కీర్తనా అనేది స్పష్టంగా తెలియదు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రుతిలయలు (1987) 
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ఎస్.జానకి

శ్రీ శారదాంబా నమోస్తుతే... 
శ్రీ శారదాంబా నమోస్తుతే... 
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే... 
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...

నాద సాధనే ఆరాధనం
రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం
రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం 
గళపీఠమే రత్న సింహాసనం 
సరిగమల స్వరసలిల సంప్రోక్షణం...

శ్రీ శారదాంబా నమోస్తుతే...

నా గానమే నీరాజనం 
నా ప్రాణమే నివేదనం 
నా గానమే నీరాజనం 
నా ప్రాణమే నివేదనం 
శ్వాసకీఇలా స్వరనర్తనం
శ్వాసకీఇలా స్వరనర్తనం
సంగీత భారతికి సంకీర్తనం 

శ్రీ శారదాంబా నమోస్తుతే...

వాగీశా వల్లభ
శ్రీ శారదాంబా... 
శ్రిత సరసిజాసన 
స్మిత మంగళానన
శ్రీ శారదాంబా...
సిద్ది ప్రదాయని 
బుద్ది ప్రసాదిని 
గీర్వాణి వీణాపాణి 
శ్రీ శారదాంబా...
లలిత లయ జనిత 
మృదుల పద గమిత 
లలిత లయ జనిత 
మృదుల పద గమిత 

కావ్య గాన లోల 
శంకర అచ్యుతాది 
సకల తిమిర సన్నుత

శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...
నమోస్తుతే...


2 comments:

శ్రీ శారదాంబా నమోస్తుతే" పాటకి అభినయించిన అబ్బాయి పేరు తెలుసా వేణూజీ..యెంత అద్భుతంగా నాట్యం చేశాడండీ..వేదాంతం సత్యన్నారాయణ శర్మగారు స్త్రీ ఆహార్యం లో నాట్యం చేస్తె అచ్చు జమునలా వుండే వారట..అంతే కాదు..నృత్యం నేర్చుకున్న మగవాళ్ళందరూ ఆడవారిలా హొయలు పోతారనే మాట యెంత అబద్ధమో ఆయన్ని చూస్తే తెలుస్తుందందట..అమ్మ చెప్పేది..అఫ్కోర్స్ మన జూనియర్ యెన్.టి.ఆర్ కూడా బెస్ట్ యెగ్జాంపులే ఆ విషయంలో..

నాకూ కరెక్ట్ గా తెలియదు శాంతి గారూ.. మాస్టర్ సంజయ్ అని కొన్ని వెబ్ సైట్స్ లో ఉంది.. వెతికి మరింత సమాచారం దొరికితే చెప్తాను.. అతని నాట్యం నాకుకూడా చాలా నచ్చింది. వేదాంతం సత్యన్నారాయణ శర్మ గారి గురించి నేనూ విన్నానండీ.. జూనియర్ యన్టీఆర్ గురించి కూడా కరెక్ట్ గా చెప్పారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.