ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా...

ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. చిల్లుల్లేని అల్లం గారెలు లేదా మినప సున్నుండలు నైవేద్యంగా పెట్టాలని అంటారు. ఈ సందర్బంగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో సుశీల గారు పాడిన ఈ చక్కని పాటను తలచుకొందామా. తనువులోని ఐదు అంశలు నింగీ, నేలా, నీరు, నిప్పు, గాలి నీ సేవకే ఉపయోగించాలనుంది అని చెప్తూ రామబ్రహ్మం గారు రాసిన ఈపాట చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ ఆల్బమ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.

ఆల్బమ్ :  ఉమాశంకర స్తుతిమాల (1982)
సంగీతం : ఉపేంద్ర కుమార్
సాహిత్యం : బేతవోలు రామబ్రహ్మం
గానం : పి.సుశీల

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
 


నా తనువునో తల్లి నీ సేవ కొరకు
నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
 


నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
 


నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నీ నామ గానాలు మోయాలి తల్లి
నీ నామ గానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

 

2 comments:

తనువులోని పంచతత్వాలతో అమ్మవారిని కొలిచే ఆలోచన.. హ్యాట్సాఫ్ టు రామబ్రహ్మం గారు.

బాగా చెప్పారు శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.