గురువారం, ఆగస్టు 21, 2014

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా..

శేఖర్ కమ్ముల చిత్రీకరించిన మరో అందమైన వానపాట ఇది. వేటూరి గారు పడవలు, బడి సెలవలు, పకోడీలు, ఇంద్రధనసులు వేటినీ వదలకుండా బాల్య జ్ఞాపకాలతో మొదటి చరణం అల్లేశారు. అలాగే రెండవచరణంలో వయసు రేపే తీయని వలపు గిలిగింతలను సున్నితంగా వర్ణించడం ఆ మహాకవికే చెల్లింది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆనంద్ (2004)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : శ్రేయ ఘోషల్

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా...
గాలి వాన లాలి పాడేస్తారా....

పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన
చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వానతో కూడీ... వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డి డ్డి...... తొడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకు మనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో
శ్రావణ మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా 

 
కోరి వచ్చిన ఈ వాన.. గోరు వెచ్చనై నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే.. ముద్దు లాటలే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు.. తడిసే తడిసే పరువాలు
గాలి వానలా పందిళ్లు... కౌగిలింతలా పెళ్లిల్లు
నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తార బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తారా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
ఓ.. కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తారా..

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.