మంగళవారం, జులై 08, 2014

పాదమెటు పోతున్నా...

శేఖర్ కమ్ముల సూపర్ హిట్ చిత్రమ్ హ్యాపీడేస్ లో ఫ్రెండ్షిప్ పై ఒక మరువలేని పాట ఇది... మిక్కీ జె మేయర్ సంగీతం చాలా కొత్తగా రిఫ్రెషింగా అలరించి మనసులో ముద్రపడిపోతుంది. ఇక శేఖర్ చిత్రీకరణ విషయం చెప్పనే అక్కర్లేదు. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : హ్యాపీ డేస్ (2007)
సంగీతం : మిక్కీ జె.మేయర్
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్

పాదమెటు పోతున్నా... పయనమెందాకైనా...
అడుగు తడబడుతున్నా... తోడురానా...
చిన్ని ఎడబాటైనా... కంటతడి పెడుతున్నా...
గుండె ప్రతి లయలోనా... నేను లేనా...

ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేనా...
ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే... అల్లుకుందీ...
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో... పంచుతోందీ...
మీరు మీరు నుంచీ... మన స్నేహగీతం...
ఏరా ఏరాల్లోకీ మారే...
మోమాటాలే లేనీ... కలే జాలువారే !

ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేగా...
ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే..
నిన్నుచూస్తే చిన్ననాటీ చేతలన్నీ చెంతవాలే...
గిల్లి కజ్జాలెన్నో... ఇలా పెంచుకొంటూ...
తుళ్ళింతల్లో తేలే స్నేహం...
మొదలో తుదలో తెలిపే... ముడి వీడకుందే...
మోమాటాలే లేనీ... కలే జాలువారే !

ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేగా...
ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...


4 comments:

Beautiful song. Mickey's music was very refreshing in the initial days. Now it became very monotonous. Being a die-hard fan of Karthik, there is nothing to say about him. He gave life to this song.

$

థాంక్స్ సిద్ గారు.. యూ ఆర్ రైట్ అబౌట్ మిక్కీ అండ్ కార్తీక్ :-))

ఒంటరితనం లో నీడయేది..ఓదార్పులో తోడయేది స్నేహమే కదండీ..'ఓ మై ఫ్రెండ్-తడి కన్నులనే తుడిచే నేస్తమా' అన్న వనమాలిగారికి హెట్సాఫ్..

అవునండీ శాంతి గారు... వనమాలి గారు కొన్ని పాటలు చాలా బాగా రాస్తారండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.