సోమవారం, జులై 21, 2014

ఏవేవో కలలు కన్నాను...

ఇళయరాజా గారి ఒక కమ్మని బాణిని జానకమ్మ స్వరంలో ఈరోజు విని ఆస్వాదించండి. కాస్త విషాదగీతమే అయినా కూడా భావం బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : జ్వాల (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : గోపి
గానం: ఎస్.జానకి

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

సుడిగాలులలో మిణికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై .. నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమె చాలు !

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

నా కన్నులలో వెలుగై నిలిచీ
చిరు వెన్నెలగా బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా
నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా
నాది పేద మనసురా .. కాన్కలీయలేనురా
కనుల నీరె కాన్కరా! 

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో...


4 comments:

మంచి పాట. జానకి గానం - రాధిక హావ భావాలు బాగుంటాయి. ఎన్నాళ్లయినా ఎన్ని సార్లు విన్నా బాగుండే పాటలలో ఇదొకటి. మంచి పాటను పరిచయం చేశారు శ్రీకాంత్ గారు.

థాంక్స్ కొండలరావు గారు.

పవిత్రమైన శాంతికీ, ప్రశాంతమైన నిశ్శబ్దత కీ రూపమిస్తే ఈ పాట..విన్నప్పుడల్లా సంతోషమో, ఉద్వేగమో తెలీదు కానీ కనులు కన్నీటిని పలుకరిస్తాయి..

థాంక్స్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.