బుధవారం, జులై 02, 2014

నా జీవన సంధ్యా...

సత్యం గారి మధురమైన సంగీతం వైవిధ్యమైన రామకృష్ణ గారి గళం కలగలసి అందాన్ని చేకూర్చిన ఒక చక్కని వేటూరి గారి సాహిత్యం ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమరదీపం (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : రామకృష్ణ, సుశీల

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...

శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల
మనసే ఎగసి పాడింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

పొద్దుపొడుపులో అరుణిమలే
చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమరిమలే
చెలి పైట జిలుగులే సవరించే
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

పలుకే పాడని పాట చిరునవ్వు పూలకే పూత
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
నడకే నెమలికి ఆట లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా
ఈ బ్రతుకే పరిమళించింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది


4 comments:

వేణు గారు, ఈ పాట అంటే నాకు ఎంత పిచ్చోనండీ, టీవీ లు లేని బంగారు రోజుల్లో రేడియోలో ఈ పాట వింటూ అలా అలా ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. కానీ పాట ని చూసాక, నాయికగారి అర్థం అర్థం లేనీ నృత్యం అవసరమా అని ఎంత గింజుకున్నానో. చిత్రీకరణ హింస కి గురైన మరొక అద్భుతమైన పాట ఇది. అన్నట్టు ఆ మధ్య దాసోహం పాట కూడా పరిచయం చేసారు, అది కూడా అస్సలు ఆణిముత్యం అనుకోండి. మంచి మంచి పాటలనీ మళ్ళా గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలండీ

థాంక్స్ ఎ లాట్ లక్ష్మి గారు... హహహ నిజమేనండీ కొన్ని పాటలు వినాలి అంతే తొందరపడి చూసేస్తే అలా డిజప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కౄష్ణం రాజు పిడికళ్ళు బిగించి తలెత్తి మాట్లాడితే తట్టుకోవడం కష్టం..కారణం ఆయన ముక్కే..అందుకే మా ఫ్రెండ్సందరూ ముద్దుగా పెట్టిన పేరు డబుల్ బారల్ గన్..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిస్ ఫాన్స్ భక్త కన్నప్ప తరువాత ఆయనని భరించినందుకు మన ప్రేక్షకులలుని మెచ్చుకోవలిసిందే సుమండీ..

హహహహ నిక్ నేమ్ బాగుందండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.