ఆదివారం, జూన్ 22, 2014

ఓ చిన్నదాన నన్ను విడిచి...

కృష్ణ గారి పాటలు చూడడమొక ట్రీట్ అన్న విషయం మనలో చాలామంది అంగీకరిస్తారు అలాంటి పాటలలో తప్పక చూడవలసిన పాట ఇది. కొసరాజు గారి సాహిత్యానికి కోదండపాణి గారి సంగీతం మాంచి హుషారుగా సాగుతుంది దానికి తగ్గట్లే బాలు గారి గాత్రమూ జోరుగా సాగుతుంది. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : నేనంటే నేనే (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఓ చిన్నదానా
ఓ..చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటుచూడూ..పిల్లా..
మనసువిప్పి మాటాడూ..బుల్లీ..
ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
ఓహోహో....  ఓహోహో
నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే..
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే..
నిలవకుండ పరుగుతీస్తే నీవే చింత పడతావే హెహే...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..
బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..
రంగు చీరలిస్తానే...ఏఏఏ....
రంగు చీరలిస్తానే ...రవ్వల కమ్మలేస్తానే..
దాగుడుమూతలు వదిలి కౌగిలి యిమ్మంటానే పిల్లా..

గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మాఆఆ..

నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా.. ఒహోహో ఆహాహా
నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా..
కారులోన ఎక్కిస్తా.. పోయ్..పోయ్..
జోరు జోరుగ నడిపేస్తా..
కారులోన ఎక్కిస్తా.. జోరు జోరుగ నడిపేస్తా..
చెంప చెంప రాసుకుంటూ జల్సాగా గడిపేస్తా..
పిప్పిరి పిప్పిరి పిపిపి
పిప్పిరి పిప్పిరి పిపిపి

ఓ..చిన్నదానఆఅ...
ఓ..చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మాఆఆ..



4 comments:

very good song..
krishna has got some more ever lasting memorable songs..
naa kosame neevunnadi,
poolu gusa gusa laadenani,
nenoka prema pipaasini

థాంక్స్ నవీన్ గారు... మంచి పాటలు గుర్తుచేశారు.

ఈ మూవీ లో మన సూపర్ స్టార్ కృష్ణగారు దేశద్రోహులని ఉద్దేశించి అనే "చీడపురుగులు"అనే డైలాగ్ భలే తమాషాగా అనిపిస్తుందండీ..చిన్నప్పుడు యెవరి మీదైనా కోపమొస్తే ఈ డైలాగ్ నే ప్రయోగించేవాళ్ళం..వన్ ఆఫ్ మై ఫావరెట్ సాంగ్స్..

హహహహ అవునా శాంతి గారు :-)) థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.