సోమవారం, జూన్ 30, 2014

శ్రీరస్తూ శుభమస్తూ..

ఈ సినిమా విడుదలయిన తర్వాత నుండీ హైందవ సంప్రదాయంలో వివాహం చేసుకునే ప్రతి ఒక్కరి పెళ్ళి వీడియో క్యాసెట్ లోనూ ఈ పాట చెరగని చోటు సంపాదించుకుంది. ఆ చోటును ఇంకా పదికాలాలపాటు నిలుపుకుంటుంది కూడా, అంత చక్కని సంగీత సాహిత్యాలీ పాట సొంతం. వాటికి తగ్గట్లు వధూవరుల క్లోజప్ షాట్స్ తో వాళ్ళ చిలిపి అల్లర్లతో ఇంత అందంగా ఈ పాట చిత్రీకరించడం బాపురమణ గార్లకే చెల్లింది. ఈ అందమైన పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం 
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
 
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మణికి నింపుకో

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం 
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

2 comments:

రాధా కల్యాణమైనా, సీతా కల్యాణమైనా..బాపూ కుంచెతో ముడిపడినవే..రెండు జెళ్ళ సీతలూ, రాలుగాయి బాబాయిలూ, లావుపాటి పినిగార్లూ, ఈల వేసే బుడుగులూ, ముద్దొచ్చే సీగానపెసూనాంబలూ..అసలిన్నేల..తెలుగమ్మాయంటే బాపూ బొమ్మయే కదండీ..

తెలుగమ్మాయంటే బాపూ బొమ్మయే కదండీ అంటూ అక్షరలక్షలు విలువ చేసే మాటన్నారు శాంతి గారు థాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.