గురువారం, మే 08, 2014

అమ్మా అమ్మా అని పిలిచావు...

కె.వి.మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని అమ్మపాట మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : విచిత్ర బంధం (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం :  పి. సుశీల

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 

ఎవరికీ మనసివ్వని దానను.. 
ఏ మమతకు నోచుకోని బీదనూ..
ఎవరికీ మనసివ్వని దానను.. 
ఏ మమతకు నోచుకోని బీదనూ..
మోడులా ఈ బ్రతుకుని మోసాను
మోడులా ఈ బ్రతుకుని మోసాను
నీ ముద్దు మోమును చూచి మరల మొలకెత్తాను

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 
 
కన్నతల్లి ఎవరో ఎరుగవు నువ్వు..
కడుపు తీపి తీరని తల్లిని నేను..
కన్నతల్లి ఎవరో ఎరుగవు నువ్వు..
కడుపు తీపి తీరని తల్లిని నేను..
కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో..
కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో 
ఒకరి కొరతనింకొకరు తీర్చుకునేటందుకో 

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 
అమ్మ అమ్మా అని పిలిచావు.. 
 

2 comments:

వృద్ధులైన తలిదండ్రులు తమ మీఎద ఆధారపడి వున్నారని చాలా మంది ఫీల్ అవుతుంటారు..అటువంటి వారికో రిక్వెస్ట్..మీరు మీకు తెలీకుండానే మీ తలిదండ్రుల పై మానసికం గా యెంత ఆధార పడి వున్నారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి..

బాగా చెప్పారు శాంతి గారు, థాంక్సండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.