శనివారం, మే 31, 2014

మనోహర నా హృదయమునే...

ఒక పదేళ్ళ క్రితం అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన పాట... ఇప్పటికీ వింటూంటే మైమరపుతో మనసును ఏ దూరతీరాలకో పరుగులెత్తించే పాట... నాకు చాలా ఇష్టమైన పాట... మీరూ ఆస్వాదించండి.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : చెలి (2001)
సంగీతం : హరీష్ జయరాజ్
రచన : భువనచంద్ర
గానం : బాంబే జయశ్రీ

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల

జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి
నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట

ఓ ప్రేమా ప్రేమా ...

సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక
వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం
నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా నీ చెలిని

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల 

5 comments:

గుడ్ సాంగ్ విత్ "ఎ" లిరిక్స్..బట్ ఇప్పటి చాలా పాటలకంటే చాలా బెటర్..ముఖ్యం గా ట్యూన్ చాలా సూథింగ్ గా మనసుని హత్తుకునేలా వుంటుంది..

అవునండీ లిరిక్స్ విషయంలో మీరు కరెక్టే.. మీరన్నట్లే ట్యూన్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో బోంబే జయశ్రీ గారి గొంతు ఆవిడ పాడిన విధానం చాలా బాగుంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

Bombay Jayasree has a very distinct voice. Another song worth remembering from her is "Tiya teeyani kalalanu" from the film Sriram.

$

థాంక్స్ సిద్ గారు.. చాలా మంచి పాట గుర్తు చేశారు.. అది కూడా త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

అజ్ఞాత గారూ.. మీ ముందరి అజ్ఞాత కామెంట్ స్పామ్ అనుకుంటానండీ పొరపాటున వచ్చినట్లుంది. అందుకే మీ ఇద్దరి కామెంట్స్ డిలీట్ చేస్తున్నాను, థాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.