శుక్రవారం, మే 30, 2014

వసంతగాలికి వలపులు రేగ...

బాలమురళీ కృష్ణ గారు పాడిన అరుదైన సినిమా పాటలలో ఓ చక్కని ప్రేమగీతం ఇది. వారితో కలిసి యుగళగీతం పాడే అవకాశం దొరకడం జానకి గారి అదృష్టమేనేమో... ఎన్టీఆర్, జమున లపై చిత్రీకరించిన ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జానకి 

ఆఆఅ....ఆఆఆఅ...
ఆఆఆఆ....
వసంతగాలికి వలపులు రేగ 
వరించు బాలిక మయూరి కాగా 
ఆఆఆఆఆఅ...
వసంతగాలికి వలపులు రేగ 
వరించు బాలిక మయూరి కాగా 
తనువూ మనసూ వూగీ తూగీ 
ఒక మైకం కలిగేనులే

ఈ మహిమ నీదేనులే 
ఆఆఅ...ప్రేమ తీరు ఇంతేనులే 
ఈ మహిమ నీదేనులే 

రవంత సోకిన చల్లని గాలికి 
మరింత సోలిన వసంతుడనగా
రవంత సోకిన చల్లని గాలికి 
మరింత సోలిన వసంతుడనగా
తనువూ మనసూ ఊగీ తూగీ 
తనువూ మనసూ ఊగీ తూగీ 
ఈ లోకం మారేనులే

ఈ మహిమ నీదేనులే 
ఆఆఆఅ....ఆహ భలే హాయిలే 
ఈ మహిమ నీదేనులే 

విలాస మాధురి వెన్నెల కాగా 
విహార లీలలు విందులు కాగా 
విలాస మాధురి వెన్నెల కాగా 
విహార లీలలు విందులు కాగా 
ఏకాంతంలో నీవూ నేనే 
ఏకాంతంలో నీవూ నేనే 
ఒక స్వర్గం కనుపించెలే 

ఈ మహిమ నీదేనులే 
ఆఆఆ...ప్రేమ తీరు ఇంతేనులే 
ఈ మహిమ నీదేనులే 

4 comments:

ఈ పాట వ్న్నపుదు యెవరి మనసైనా వసంత గాలుల్లో, వింత లోకాల్లో వూగిసలాదితే..ఆ మహిమ ఖచ్చితం గా బాలమురళీ కృష్ణ గారిదే వేణూజీ..

థాంక్స్ శాంతి గారు.. కరెక్ట్ గా చెప్పారు..

వీరాభిమన్యు (1965) లో ఒక ఆణిముత్యాల పాట, ఈ పాటల ముగ్గులలో ఉన్నట్లు అనిపించడం లేదండీ!
"చల్లని స్వామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లీ@." కాంచన నటన ఆ పాటకు గొప్ప అభినయాన్ని అందించింది. - కాదంబరికుసుమాంబ 1955

థాంక్స్ వైజయంతి గారు. ఇప్పటివరకూ ప్రచురించలేదండీ త్వరలో ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.