శనివారం, మే 24, 2014

సుందరమో సుమధురమో...

అమావాస్య చంద్రుడు సినిమా కోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రాసిన ఈపాట నాకు బోలెడు ఇష్టం అన్న ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పినా తక్కువే... ఇంత చక్కని పల్లవిని వేటూరి గారు అలవోకగా రాజా గారు ట్యూన్ చెప్పిన మరుక్షణమే చెప్పేశారంటే ఆ మహాకవి గొప్పదనాన్ని ఏం చెప్పగలం. ఆ పల్లవి విన్న రాజా గారూ కూడా "ఆహా! సుందరత్తెలుంగు అని భారతి మహాకవి ఎందుకన్నాడో ఇప్పుడు తెలిసింది” అంటూ వేటూరి గారిని మెచ్చుకున్నారుట. పాటకు ముందు బాలలు కోరస్ గా పాడే "సరిగమపదని.." అన్న చిరు గీతం కూడా వేటూరి వారు ఐదునిముషాలలో రాసిచ్చేశారట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమావాస్య చంద్రుడు (1981)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : బాలు, జానకి, టి.వి.గోపాలకృష్ణన్, కోరస్

సరిగమ పదని సప్తస్వరాలు మీకు
అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు
 
సరిగమ పదని సప్తస్వరాలు మీకు
అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు
మనసే ఒక మార్గము
మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకు దైవము

సరిగమ పదని సప్తస్వరాలు మీకు
అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు 

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజ రాగ వశీకరమో
 
సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో

ఆఆఆఆ...ఆఆఆఆ....
ఆనందాలే భోగాలైతే.. 
ఆఆఆఆ...ఆఆఅ
హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే
సురవీణ నాదాలెన్నో మోగేనులే

వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో
మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలు

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
అందాలన్నీ అందే వేళ
ఆఆఆఆ...ఆఆఅ 
బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే
కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే శారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో

సుందరమో సుమధురమో

చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజ రాగ వశీకరమో

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో 

చందురుడందిన చందన శీతలమో

2 comments:

ఈ మూవీ ప్రేమికులకి ఓ భగవద్గీత వేణూజీ..

హహహ ఒక్కమాటలో తేల్చేశారుగా థాంక్సండీ :-))

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.