శుక్రవారం, మే 23, 2014

అదే నీవు అదే నేను...

విడుదలకు ముందే అవార్డులను సొంతం చేసుకున్న చిత్రం "అభినందన" లోని ఈపాట విషాద గీతమైనా కూడా ఈ సినిమాలోని మిగిలిన విషాద గీతాలతో పోలిస్తే కాస్త నయమే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ వినండి.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు

ఆ హా హా హా....
ఆ ఆ ఆ....
ఆ....

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
కథైనా... కలైనా... కనులలో చూడనా 

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా...


కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిలిలో గూడు చేసుకున్నాము
అదే స్నేహమూ.. అదే మోహమూ
అదే స్నేహమూ.. అదే మోహమూ..
ఆది అంతం ఏదీ లేని గానము

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
కథైనా... కలైనా... కనులలో చూడనా


నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ...
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా... అదే ఆశ గా...
అదే బాసగా... అదే ఆశ గా...
ఎన్ని నాళ్ళీ నిన్న పాటే పాడను

అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
కధైనా... కలైనా... కనులలో చూడనా
అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా


2 comments:

యెప్పుడు బీచ్ కి వెళ్ళినా ఈ పాట వినాలనిపిస్తుంది..

థాంక్స్ శాంతి గారూ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.