సోమవారం, మే 19, 2014

చిరు చిరు చినుకై కురిశావే...

ఆవారా సినిమా కోసం యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాట నిజంగా చిరు జల్లుకురిసినంత ఆహ్లాదంగా హాయిగా సాగిపోతుంది నాకు చాలా ఇష్టమైన పాట. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆవారా
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : హరి చరణ్ 

చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే..
మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే..
నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే
గాలై ఎగిరేను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే

చిరు చిరు చిరు చినుకై కురిశావే 
మరుక్షణమున మరుగై పోయవే

దేవతా తనే ఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే  చాలునా
గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే అడగకా పూవ్వులే పుయునా
సిగలో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయ్యాల..
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మదిమురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమే నా స్పందన...
నేలపై పడే ఒక నీడనే చక చకచేరనా ఆపనా గుండెలో చేర్చనా....
దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింటూఉంటే తీయగా వేధిస్తుందే..
ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే..
మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే..
చిరు చిరు చిరు చినుకై కురిసావే ఏ..ఏ.యే..యే..
మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే.


2 comments:

సూర్య బ్రదర్ కార్తీక్ అంటే నమ్మడం కష్టం..చూడటమూ కష్టమే..సాంగ్..ఓకె..ఓకె..

హహహ ఇద్దరికీ పోలికలు ఉండవు కానీ కార్తీక్ కూడా బానే ఉంటాడు కదండీ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.