సోమవారం, మే 12, 2014

ఢిల్లీకీ రాజాకైనా..

నిన్నటి వరకూ అమ్మ ప్రేమ గొప్పదనం తెలిపే పాటలు విన్నారుగా ఈవేళ బామ్మ మాట గురించి వినండి :-) భానుమతి గారి స్వరంలో ఖంగుమంటూ వినిపించే ఈ పాట నాకు అప్పుడప్పుడు సరదాగా వినడం ఇష్టం. ఈ సినిమా తలచుకున్నపుడల్లా చిన్నపుడు చూసి ఎంజాయ్ చేసిన ఇందులోని సూపర్ కార్ చేసే విన్యాసాలు గుర్తొచ్చి ఆనందమనిపిస్తుంది. దాంతోపాటే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేసి మరిన్ని ఉన్నతశిఖరాలు చేరుకోగల సత్తా ఉన్న నూతన్ ప్రసాద్ లాంటి గొప్ప నటుడి కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం గుర్తొచ్చి దిగులేస్తుంది. 

సినిమాలో ఈ పాట టైటిల్స్ కి నేపధ్యంలో వినిపిస్తుంది ఎంబెడ్ చేసిన వీడియోలో పూర్తి సినిమా చూడవచ్చు. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : బామ్మ మాట బంగారు బాట (1989)
సంగీతం : చంద్రబోస్ (తమిళ్ కంపోజర్)
సాహిత్యం : వేటూరి
గానం : భానుమతి

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట
పైపై మెరుగుల భామలకన్నా బామ్మలు ఎంతో మెరుగంటా
 
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట


బలగమున్నా పార్టీలున్నా.. వెలగబెట్టే పదవులు ఉన్నా..
బామ్మ మాటే వినమంటా
మధువు పంచే మగువే ఉన్నా.. కరువు తీరే కలిమే ఉన్నా..
బామ్మ మాటే వినమంటా
ఓ నాటి పోతన్న... ఆనాటి వేమన్న
ఓ నాటి పోతన్న... ఆనాటి వేమన్న
ఉంటే.. బ్రతికుంటే.. ఈ మాటే పలికేరంటా
 
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట


కట్నకానుకలిచ్చే వేళ.. కన్నెనింటికి తెచ్చే వేళ..
బామ్మ మాటే వినమంటా
ఇల్లు వాకిలి కట్టే వేళ.. అప్పుసొప్పు చేసే వేళ
బామ్మ మాటే వినమంటా
కన్నీటి పాటైనా.. కంచెర్ల గోపన్న
ఉంటే.. బ్రతికుంటే.. ఈ మాటే పలికేనంటా
 
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట
 


ఏ బినామీ భూములు ఉన్నా.. స్విస్సు బ్యాంకులో సొమ్ములు ఉన్నా
బామ్మ మాటే వినమంటా
చట్టసభలో తన్నులు తిన్నా.. పిట్ట కథలో దెబ్బలు తిన్నా..
బామ్మ మాటే వినమంటా
వినరా ఓ తెలుగోడా.. ఘనుడైన గురజాడ..
ఉంటే.. బ్రతికుంటే.. ఈ మాటే పలికేనంట

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట
పైపై మెరుగుల భామలకన్నా బామ్మలు ఎంతో మెరుగంట
 
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట 

 

2 comments:

కొన్ని బ్లాక్ అండ్ వైట్ మూవీస్ మినహాయిస్తే, భానుమతి గారి మూవీస్ లో గుర్తుంచుకుందామన్నా మరో కేరక్టర్ రిజిస్టర్ కాదు..అందులోనూ నా లాంటి వీరాభిమానులకి..థాంక్యూ వేణూజీ..

థాంక్స్ శాంతి గారు.. అదీ కొంతవరకూ నిజమేనండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.