బుధవారం, ఏప్రిల్ 02, 2014

నీకోసం నీకోసం...

ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన పాటలను ఎప్పటికి మరిచిపోలేని కొందరు అభిమానులు అలాగే ఎప్పటికీ ఉంటారేమో.. కొన్నాళ్ళకి ఒకే మూసలో ఉన్నట్లు అనిపించినా ఉన్న కొద్దిరోజులు తను స్వరపరచిన మెలోడీస్ మాత్రం ఎవర్ లాస్టింగ్. ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో శ్రీనూ వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాలో ఈ పాట ఒక హాంటింగ్ మెలొడీ... మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : నీకోసం(1999)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం : సాహితి
గానం : రాజేష్, కౌసల్య 

నీకోసం .. నీ కోసం
నీకోసం .. లలలా.. నీ కోసం

ఎపుడూ లేని ఆలోచనలు 
ఇపుడే కలిగెను ఎందుకు నాలో ..
నీకోసం .. నీ కోసం
ఈ లోకమిలా .. ఏదో కలలా .. 
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీకోసం .. నీ కోసం
నీకోసం ..
లాలలా.. నీ కోసం 

లలలలలా..లలలలలా..లాలాలా..
లలలలలా..లలలలలా..లాలాలా.. 
లాలాల..లాలాల..
సయ్య సయ్య సా సయ్య సయ్య సా 
సయ్య సయ్య సయ్య సయ్య
సయ్య సయ్య సా సయ్య సయ్య సా 
సయ్య సయ్య సయ్య సయ్య

నాలో ఈ ఇదీ .. ఏ రోజూ లేనిదీ
ఏదో అలజడీ .. నీతోనే మొదలిదీ
నువ్వే నాకనీ .. పుట్టుంటావనీ
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా

నీకోసం .. నీ కోసం
నీకోసం ..
లాలలా.. నీ కోసం

నాలో ప్రేమకీ .. ఒక వింతే ప్రతీదీ
వీణే పలుకనీ .. స్వరమే నీ గొంతుదీ
మెరిసే నవ్వదీ .. మోనాలీసదీ
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ

ఎపుడూ లేని ఆలోచనలు 
ఇపుడే కలిగెను ఎందుకు నాలో ..
నీకోసం .. నీ కోసం
ఈ లోకమిలా .. ఏదో కలలా .. 
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీకోసం .. నీ కోసం
నీకోసం ..
లాలలా.. నీ కోసం

4 comments:

Wonderful. Thanks for the lovely song. A friend of mine who is an independent music director now (mostly working on private albums though)assisted RP garu during "Nee kosam" time. I have nice memories about this song recording. Rajesh had a real soothing voice like Karthik which perfectly suits the romantic songs.

$id

Pleasure is mine sid ji. మీ జ్ఞాపకాలను గురించి తెలుసుకోవడం బాగుంది. థాంక్స్ ఫర్ షేరింగ్.

రాజేష్ పాటల్లో నా కిష్టమైనది .."యెటో వెళ్ళి పోయింది మనసు" ..

థాంక్స్ శాంతి గారు.. అవునండి ఆపాటతోనే తను ఫస్ట్ బాగా ఫేమస్ అయినట్లున్నాడు కదా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.