మంగళవారం, మార్చి 04, 2014

చందమామ కథలు..

ఆడియో కూడా విడుదలవకముందే మీడియాలో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన చందమామ కథలు సినిమాలోని టైటిల్ సాంగ్ ఇది చాలా బాగుంది. మిక్కీ జె మేయర్ మెలోడీస్ అన్నీ ఒకేలాగా ఉన్నాయనిపించినా అవే పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది. ఈ పాటని కళ్యాణి పాడిన తీరు కూడా నాకు చాలా బాగానచ్చింది. మీరూ ఆస్వాదించండి యూట్యూబ్ పని చేయని వాళ్ళు రాగాలో ఇక్కడ వినవచ్చు. 

అలాగే ఆసక్తి సమయం ఉన్నవారు ఈ యూట్యూబ్ ఛానల్ పై క్లిక్ చేస్తే ఆడియో ఫంక్షన్ వివరాలు, మొత్తం పాటల జ్యూక్ బాక్స్, ఈ సినిమాలో చెప్పబోయే ఒకో కథ పరిచయం చేసే ట్రైలర్స్ ఆయా పాత్రల మేకింగ్ వీడియోలు, పాటల ప్రోమోస్ అన్నీ చూడవచ్చు. 'LBW', 'రొటీన్ లవ్ స్టోరీ' లాంటి సినిమాలు తీసిన ప్రవీణ్ అచ్చతెలుగు పేరుతో పేరుతగిన కథలతో తీస్తున్న తరువాత సినిమాగా కాస్త మంచి అంచనాలు ఉన్న సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఆ అంచనాలని మరింత పెంచింది ఆ ట్రైలర్ ని ఈ పోస్ట్ చివరలో ఎంబెడ్ చేశాను చూడండి.  



చిత్రం : చందమామ కథలు (2004)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కళ్యాణి

కలనీ ఇలనీ కలిపిన వారధులూ..
కలిమి లేమి కలిగిన సుధలూ..
ఎపుడేమైనా తరగని సంపదలూ...
ఇపుడే భువిలో ఇవి జనపదులూ..
చందమామ కథలు 
సాటివారి ఎదలు దాచు మేడలూ..
చందమామ కథలూ 
వారివీరి సొదలూ తమ పునాదులూ..

ఇవాళ ఇలాగ నీముందు ఉన్నది 
ఇలాగే ఇలాగే రేపుండదోయనీ 
నిజంలో బలాన్ని చూపిస్తు ఉన్నదీ
కొన్నాళ్ళు వెలుగులలో 
కొన్నాళ్ళు మసకలలో 
వందేళ్ళు గడపమనీ అన్నాయి 

కలనీ ఇలనీ కలిపిన వారధులు 
కలిమి లేమి కలిగిన సుధలూ..
ఎపుడేమైనా తరగని సంపదలూ..
ఇపుడే భువిలో ఇవి జనపదులూ
చందమామ కథలు..
సాటివారి ఎదలు దాచు మేడలూ
చందమామ కథలూ..
వారివీరి సొదలూ తమ పునాదులూ

ఆఆ..ఆఆ..ఆఆఆ...హాఅ..హాఅ...ఆఆ..ఆ..

తపించే గుణాన్ని నీడల్లే మార్చుకో 
శపించే క్షణాన్ని ఓడించి వంచుకో 
నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో 
అదిచాలు తరువాతా 
మిగిలింది తలరాత 
అనుకుంటు బతకమని అన్నాయి

కలనీ ఇలనీ కలిపిన వారధులు 
కలిమి లేమి కలిగిన సుధలూ..
ఎపుడేమైనా తరగని సంపదలూ..
ఇపుడే భువిలో ఇవి జనపదులూ..
చందమామ కథలు.. 
సాటివారి ఎదలు దాచు మేడలూ
చందమామ కథలూ.. 
వారివీరి సొదలూ తమ పునాదులూ

6 comments:

మీకు ఇందులో సాహిత్యమా లేక మిక్కి సంగీతమా ఏది నచ్చింది ?మీ సమాధానం మొదటిది అయితే వొకే కానీ రెండోది అంటే మాత్రం మీకు వైవిధ్యం కన్నా మూస బాణీలే ఇష్టమని అర్ధం.హ్యాపి డేస్ పాట బాణీనే తిరిగి వాడటం సంగిత దర్శకుదిలోని చేతకాని తనానికి వొక గట్టి నిదర్శనం.

హేపీ డేస్లో పాటలా ఉంది ఇది! అప్పుడెప్పుడో 'దస్ కహానియా', 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' అని రెండు హిందీ చిత్రాలు వచ్చాయి కదండీ..తొమ్మిదో, పదో కథలని ఇంటర్లింక్ చేస్తూ...! అలా తీసినట్లున్నారు ఈ సిన్మా..

ఈ పాట నాకూ నచ్చిందికానీ తన పాత పాట లానే అనిపించింది .కొత్తగా లేక పోయినా వినడానికిమాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనేలా హాయిగా ఉంది .radhika (nani)

astrojoyd గారు థాంక్సండీ. నాకు కళ్యాణి పాడిన విధానం, లిరిక్, సంగీతం మొత్తం మూడూ నచ్చాయండీ. మిక్కీ ఎక్కువగా ఒకటే అర్కెస్ట్రేషన్ ఉపయోగించడం వలన మనకి అలా తన పాత పాటలానే అనిపిస్తుంటుంది అని నా అనుకోలు. కానీ ఇతనిమీద ఉన్న మేజర్ కంప్లైంట్ కూడా అదేలెండి, తనని తాను మార్చుకుంటే ఎక్కువకాలం కొనసాగుతాడు లేదంటే ఒక నాలుగు సినిమాలతో కనుమరుగౌతాడు.

థాంక్స్ తృష్ణ గారు, అవునండీ లైఫ్ ఇన్ ఎ మెట్రో తరహాలోనే తెరకెక్కించి ఉంటాడు అనిపించింది నాక్కూడా.

థాంక్స్ రాధికగారు నిజమేనండీ డూప్లికేట్ లా అనిపించినా సూతింగ్ మ్యూజిక్ అండ్ కళ్యాణి స్వరం, అనంతశ్రీరామ్ సాహిత్యం వలన మళ్ళీ మళ్ళీ వినగలిగేలా ఉంది.

వింటున్నపుడు హాయిగా వుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.