మంగళవారం, మార్చి 25, 2014

నాదం నీ దీవనే...

ఇళయరాజా గారి మరో మధురమైన కంపొజిషన్... జానకమ్మగారి స్వరంలో వేటూరి గారి అక్షరాలు ఆ అమ్మాయి ప్రేమని ఆరాధనని మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. తెలుగు వీడియో దొరకలేదు తమిళ్ వీడియో ఎంబెడ్ చేశాను. భారతీరాజ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాధ చాలా చక్కగా ఉంటుంది ఇందులో. ఈ పాట తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : రాగమాలిక (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

అమృతగానం ఈ అనురాగం నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై ఎగసి ముగిసిపోదునే
కన్నుల మౌనమా కలకే రూపమా
దాచకే మెరుపులే పన్నీర్ మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే

నాదం నీ దీవనే

కోయిలల్లే నాద మధువే పొందకోరే దీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే
కోవెల బాటలో పువ్వుల తోరణం
ఎంతకూ మాయని తియ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

4 comments:

nice song! tamil song is also sweet.thanks for the link :)

థాంక్స్ తృష్ణ గారు.. :-)

ఇసై జ్ఞాని ఇళైరాజా గారి అద్భుతమైన సంగీత బాణీలలో..అమృతమంటి పాట..ఇందులోని "నదికి ఆందం " పాట కూడా ప్రెజంట్ చేయండి వేణూజీ..

థాంక్స్ శాంతి గారు, అలాగేనండీ ఆపాట కూడా త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.