బుధవారం, ఫిబ్రవరి 26, 2014

అందెను నేడే అందని జాబిల్లి

తోడు అనేది అందని జాబిలిగా ఎంచి ఎదురు చూస్తున్న ఆమె దిగులును పటాపంచలు చేస్తూ తను కోరిన చెలుడు తన చెంతకు చేరాడట. ఆ ఆనందంలో ఇన్నేళ్ళకు వసంతములు విరిశాయిట, మల్లెలూ నవ్వాయిట ఇంకా ఆతని స్పర్శ తనలో గిలిగింతల పులకింతలు రేపాయిట. తనతోడు తనకి దొరికిందని ఇకపై కన్నీటి ముత్యాలు రాలవు, తోటలో పూవులూ వాడవు అంటూ నమ్మకంగా ఈమె చెప్తున్న ప్రేమ కబురు దాశరధి గారి మాటలలో విందామా. సాలూరు వారి సరళమైన సంగీతం ఈ పాటని కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.





చిత్రం : ఆత్మగౌరవం(1965)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు 
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల

 మ్.హుహుహు..ఓహోహొహోహోహో..
ఓహొహొహో ఆఅహాహాహహా
ఓహొహొహో ఆఅహాహాహహా


అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి


ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే 

అందెను నేడే అందని జాబిల్లి

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే 

అందెను నేడే అందని జాబిల్లి
 
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
నా అందాలన్ని ఆతని వెన్నెలలే

2 comments:

సో స్వీట్..వేణూజీ..వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్..థాంక్యూ సో మచ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.