శనివారం, ఫిబ్రవరి 22, 2014

దిక్కులు చూడకు రామయ్యా

రేడియోలో విన్న పాటలలో ఇది కూడా ఒకటి. పాటలంటే బాలు గారి గొంతో ఘంటసాల గారి గొంతో తప్ప మిగిలిన గొంతులు ఏవీ పెద్దగా వినపడని ఆ రోజుల్లో మరో కొత్త గొంతు ఏది వినపడినా కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించి చెవులు రిక్కించి వినేటైమ్ లో ఈ జి.ఆనంద్ గారి పాటలు కూడా ప్రత్యేకంగా అనిపించేవి. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : కల్పన (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి 
గానం : సుశీల, జి.ఆనంద్

ఓఓ.ఓ..ఓ.ఓఓ..
దిక్కులు చూడకు రామయ్యా.. 
పక్కనే ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా.. 

పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..

సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా... 

ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా

ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
కదలికలన్నీ కథలుగ అల్లి 

కవితలే రాసుకుంటావో..రామయ్యా..
పొన్నలు పూచిన నవ్వు... 

సిరివెన్నెల దోచి నాకివ్వు.
పొన్నలు పూచిన నవ్వు... 

సిరివెన్నెల దోచి నాకివ్వు.
ఆ వెన్నెలలో... నీ కన్నులలో... 

ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. 

సన్నజాజులే రువ్వు..కను సన్నజాజులే రువ్వు.. 
సీతమ్మా..సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దులగుమ్మా

కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో..

నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
ఆ వెల్లువలో... నా పల్లవిలో.. 

ఆ వెల్లువలో.. నా పల్లవిలో..
రాగమే పలికించు.. అనురాగమై పులకించు..

రాగమే పలికించు.. అనురాగమై పులకించు..
సీతమ్మా..సీతమ్మా.. 
 
దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దులగుమ్మా..
 

4 comments:

భలే పాట! ఈ పాటతో మా ఇంట్లో అందరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉందండీ. మా అమ్మానాన్న పేర్లు సీతారామం అవ్వడంతో మా అన్నయ్య చిన్నప్పుడు ఈ పాడేప్పుడు.. చివర్లో "రామయ్యోయ్..." అని ప్రత్యేకంగా అరిచేవాడు..:) అప్పట్లో నాన్నగారు చేసిన అన్నయ్య పాట రికార్డింగ్ ఇప్పటికీ విని నవ్వుకుంటూ ఉంటాం..:-)

థాంక్స్ తృష్ణ గారు :-) హహహ మీ అన్నయ్యగారి అల్లరి బాగుందండీ :-)

మురళీ మోహన్-జయచిత్ర+ఈ పాట..వాటే డిజాస్టరస్ కాంబినేషన్ సర్ జీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.