సోమవారం, ఫిబ్రవరి 10, 2014

ఓంనమః నయన శ్రుతులకు

ఈ పాట దీనికి వచ్చే లీడ్ సీన్స్ నాకు మణిరత్నంపై అభిమానం కొండంత పెరిగిపోవడానికి గల కారణాలలో ఒకటి. ఈ సీన్స్ లో పొగమంచుని తను ఉపయోగించుకున్న తీరు అద్భుతం, ఐలవ్యూ చెప్పిన తర్వాత వచ్చే ఇళయరాజా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం, నిద్రపోదామని ప్రయత్నించినా కూడా పొగమంచులా తన ఆలోచనలు గీతని ఎలా కమ్ముకున్నాయో అవి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూపించడం అద్భుతం. 

తరువాత సీన్ లో గీత తలుపు తీసుకుని ఎంటర్ అయినపుడు తను పిలవకుండానే మెత్తగా తాకిన పొగమంచు చల్లదనానికి నాగ్ వెనకకి తిరిగి చూడడం అద్భుతం, గుండె కొట్టుకునే శబ్దంతో శ్రుతిచేసి పాటని ప్రారంభించడం అద్భుతం, వేటూరి గారి సాహిత్యం అద్భుతం. ఇన్ని అద్భుతాలు కలిసిన ఆ సీన్ ప్లస్ పాట మీరుకూడా చూసేయండి మరి. 

ఎంబెడ్ చేసిన వీడియోలో ముందు చెప్పిన సన్నివేశాలు కూడా ఉన్నాయి, కేవలం పాట మాత్రమే చూడాలంటే కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ లేదా చిమటాలో ఇక్కడ వినండి.



చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి

ఓంనమః నయన శ్రుతులకు
ఓంనమః హృదయ లయలకు ఓం...
ఓంనమః అధర జతులకు
ఓంనమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో... ఓఓఓఓ..
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో..

రేగిన కోరికలతో గాలులు వీచగా..
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా..
కాలము లేనిదై గగనము అందగా..
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం...

ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగా మారనా..
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి...ఓం..

ఓం నమః నయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో..

6 comments:

This is one of the most beautifully picturized romantic songs on Telugu cinema screen. There are no foreign country locations, no dance, not even out door landscapes or settings, but Mani sir showed the essence of love just by using a revolving camera. The music and lyrics did their best to make it an all time top rated romantic song.

$id

థాంక్స్ తృష్ణ గారు..
థాంక్స్ సిద్దార్థ్ గారు మీ ప్రతిమాటతోనూ ఏకీభవిస్తాను.
థాంక్స్ కార్తీక్ జీ..

ముద్దు మీద యువతీ యువకుల్లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన పాట ఇది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.