గురువారం, జనవరి 02, 2014

చేతికి గాజుల్లా.. కళ్ళకు కాటుకలా..

కన్నయ్య పాటలు ఎన్ని తలచుకున్నా బోర్ కొట్టడమంటూ ఉండదు కానీ జస్ట్ ఫరే ఛేంజ్ ఒక రెండు రోజులు కన్నయ్య రిఫరెన్స్ తో ఉండే సోషల్ సాంగ్స్ చెప్పుకుందాం. చంద్రమోహన్ పాల్ఘాట్ మాధవన్ క్యారెక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా మరి అది ఎందులోదో తెలుసా... ఆ మధ్య హిట్ అయిన హమ్ దిల్ దేచుకే సనమ్ కాన్సెప్ట్ తో ముప్పై ఏళ్ల క్రితమే బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాధాకళ్యాణం సినిమా లోనిది.

సినిమా ముగింపు ఎలా ఉన్నాకూడా ఒక మంచి ప్రేమకథా చిత్రమది. అందులో కె.వి.మహదేవన్ గారి సంగీతంలో వచ్చిన మధుర గీతం ఈ "చేతికి గాజుల్లా" పాట. బాలు శ్రావ్యమైన గాత్రంలో మహదేవన్ గారి బాణి జ్యోతిర్మయి గారి సాహిత్యం రెండూ మధురంగా మనసులో శాశ్వతమైన ముద్ర వేసేస్తాయి. ఈ పాట వీడియో మీకోసం... ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.

Chetiki Gajulla by rampandu-bellary
చిత్రం : రాధాకళ్యాణం(1981)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : జ్యోతిర్మయి 
గానం : బాలు

చేతికి గాజుల్లా.. కళ్ళకు కాటుకలా..
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు...


మానసమున నీ ప్రణయము మారుమ్రోగగా
కావ్యగానమాలపించి కవి నేనైతి
మానసమున నీ ప్రణయము మారుమ్రోగగా
కావ్యగానమాలపించి కవి నేనైతి
మధుమాసం చెలి మోమున విరిబూయగనే
మధుమాసం చెలి మోమున విరిబూయగనే
భావ రాగ తాళములను మేళవించితీ
యేటికి కెరటంలా పాటకు చరణంలా
సీతకు రాముడిలా రాధకు మాధవుడు...

చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు...


పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘమాల పరవశించెను
పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘమాల పరవశించెను
నవనీతపు చెలి హృదయము నను చేరగనే
నవనీతపు చెలి హృదయము నను చేరగనే
అతిశయమున బ్రతుకు వీణ శృతులు చేసెనూ
పగటికి సూర్యునిలా రేయికి జాబిలిలా
గౌరికి ఈశునిలా రాధకు మాధవుడు...

చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు...

4 comments:

You may also like "Brindavanamali" song from Tappu chesi pakku koodu movie.

$iddharth

థాంక్స్ సిద్దార్థ్ గారు.. హా ఆ పాటవిన్నానండీ బాగానే ఉంటుంది.

నా పాటను పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు..

ఈపాట వీడియో లోడ్ చేసి అందుబాటులో ఉంచినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి రాంపండు గారు. థాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.