మంగళవారం, డిసెంబర్ 24, 2013

వేవేల గోపెమ్మలా మువ్వాగోపాలుడే..

ఈ పాట చూసినపుడు విశ్వనాథ్ గారిపై నాకు అపుడపుడు కోపం వస్తుంటుంది అంటే చాలాసార్లు నవ్వుకున్నా అపుడపుడు మాత్రం కోపమనమాట. తెలుగు సినిమా పాటల చిత్రీకరణపై సెటైరిక్ గా ఒక పాట తీద్దామని అనుకున్నారు బానే ఉంది కానీ దానికి ఒక మీడియోకర్ పాటను ఎంచుకుని సైతం ఇలా చిత్రీకరించి ఉండవచ్చు కదా ఇంత మంచిపాట రాయించుకుని ఇంత చక్కని బాణికట్టించుకుని ఈ పాటని అలా పాడుచేయాలని ఎలా అనిపించిందో ఈయనకి అని తిట్టుకుంటూంటానమాట :-)
అందుకే ఎక్కువసార్లు ఈ పాట చూడకుండా ఆడియో మాత్రం వింటూ ఊహలలోకి వెళ్ళిపోతుంటాను. పాటమొదట్లోనూ చరణాలకు ముందు వినిపించే వేణుగానం ఎంతోఅద్భుతంగా ఉంటుంది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంటుంది. ఇక వేటూరి వారి సాహిత్యం గురించి ఏం చెప్పగలం అంత బాగా ఆయనమాత్రమే రాయగలరని తప్ప. ఈ చక్కనిపాట చూసి విని ఎంజాయ్ చేయండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : సాగరసంగమం 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం: బాలు, శైలజ

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే


ఆ అహహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే...ఏ..ఎ..
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె ఆఆ..ఆఅ
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె


చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే..ఏ..ఎ..ఎ..
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే

రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
ఆఆ..ఆఅ
 గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే

నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ అహహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే..మ్మ్.. మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే..మ్మ్.. మది వెన్నెలు దోచాడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..
మా ముద్దూ గోవిందుడే.

4 comments:

Susheelamma would have done better job than Sailaja for this sweet song.

$iddharth

చాలా మంచి పాట..వేవేల గోపెమ్మల్లో వుండాల్సిన మాధవుడిని ఒంటరి గా వుంచేశారేంటండీ..

హహహ శాంతి గారు ఏమోనండీ నాకెందుకో అలాగే ఉంచాలనిపించింది, ఆ బొమ్మ ముద్దు గోవిందుడిది అనమాట :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.