మంగళవారం, డిసెంబర్ 17, 2013

చందన చర్చిత నీలకళేబర

ధనుర్మాసం ఆరంభమైందట కదా మరి కృష్ణప్రేమికులంతా ఆరాధనకు సిద్దపడి ఉంటారుగా.. అందుకే ఈవేళ నేనుకూడా మా కృష్ణయ్యపాటనే తీసుకు వచ్చాను. ఈ జయదేవుని అష్టపదిని ఇప్పటివరకూ నాలుగు సార్లు సినిమాలలో వాడారని వినికిడి. మొదటిసారి 1936 లో సతీ తులసి అనే చిత్రంలో ఉపయోగించిన పాట దొరకలేదు కానీ మిగిలిన వర్షన్స్ చిత్తగించండి.

తెనాలి రామకృష్ణ చిత్రం కోసం 1956 లో సుశీలమ్మ పాడిన ఈపాటే నాకు అన్ని వర్షన్స్ లోకెల్లా బాగానచ్చింది. ఎమ్మెస్ విశ్వనాథన్ గారి స్వరసారధ్యంలో వచ్చిన ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ నొక్కండి పూర్తి పాట లేదు. కింద ఎంబెడ్ చేయబడినది కృష్ణుని చిత్రాలతో ఆడియో మిక్స్ చేసి చేసిన ప్రజంటేషన్. ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.
 


చిత్రం : తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్ రామమూర్తి
సాహిత్యం : జయదేవుడు
గానం : సుశీల

హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
కేళిచలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే

కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం
 

హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామా.. ఆ ఆ ఆ...

హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళిపరే
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి

~*~*~*~*~*~*~*~*~*~*~

ఆ తర్వాత “శ్రీకృష్ణ సత్య” అనే చిత్రంలో బాలుగారి గాత్రంలో 1971 లో వచ్చిన ఈ పాటను ఇక్కడ వినవచ్చు.


~*~*~*~*~*~*~*~*~*~*~

ఆ తర్వాత పరదేశి అనే సినిమా కోసం మనో బృందం పాడగా కీరవాణి గారి స్వరసారధ్యంలో 1998 లో వచ్చిన వర్షన్ ఇది. అన్నిటిలోనూ సుశీల గారు పాడిన పాటే నాకు బాగా నచ్చింది. అయినప్పటికీ కీరవాణి గారి ఫ్యూజన్ వర్షన్ కూడా బాగానే ఉందనిపించింది కాకపోతే కేవలం క్లాసికల్ తప్ప ఫ్యూజన్ సంగీతం పట్ల ఆసక్తి లేనివాళ్ళు వినవద్దని మనవి, అలవాటున్నవారికి మాత్రం ఈ వర్షన్ కూడా నచ్చి తీరుతుంది. ఆడియో వర్షన్ వినాలంటే ఇక్కడ వినవచ్చు. 




చిత్రం : పరదేశి (1998)
సాహిత్యం : వేటూరి
సంగీతం : కీరవాణి
గానం : మనో, శుభ, సంగీత

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మణి..
It's such lovely music, but I can't sing it this style
చందన చర్చిత


చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి

హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ
గోకులమున రాధికలోన మరుల వేణుగానము లొలికిన కృష్ణ
Maidens of the meadows field ? Spirit that is so real..
Your presence is a love song కృష్ణ

సరిగమలన్నీ సరసాలాడే రిస దపగరిగ రిగప గపద పదసగరి రిస దపగ
I can feel the magic and it feels so strong
And I can feel the మోహనం of this song and I just want to sing
సరిగపదసాస

సరిగమలన్నీ సరసాలాడే మోహనమే రసకేళీ...ఈఈఈ..

చందన చర్చిత
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి

ధిన్ తరనన ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ తననా
ధిన్ తననన హెయ్ ధిన్ తననత
ధింతనననన ధిననన ధిననన ధిన్ ధిన్ తనానననాన
ధింత నననిననా హెయ్యే ధింత నననిననా
హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ
ప్రేమ కథగా మారిన వేళ వలపు వెన్నదోచిన గడుసరి కృష్ణ
Come out of the shelf right now,
Stop stealing the butter right now
You've got everything.. haven't you? కృష్ణా ...
మిసిసిపి తీరే ముసిముసి నవ్వే
రిస దపగరిగ రిగప గపద పదసగ రిస దపగ
They tell me you're shy, they say you make them cry,
You're the thief of hearts, you're a little butterfly
and you make me feel the passion deep inside

మిసిసిపి తీరి ముసిముసి నవ్వే కోరితిరా బ్రతిమాలి

చందన చర్చిత
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ

8 comments:

ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట. మంచి పాటను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు వేణుగారూ!

ఈ రోజు ధనుర్మాసం రెండో రోజు వేణూజీ..నల్లనయ్య, నీలాకాశం, నెమలికన్నులు, నీలి కలువలు, నీలోత్పల కాంతలు, కాంతులు..కలల బృందావనాన్ని కనులముందుంచారు..థాంక్యు..

వేణూజీ..పొరపాటున కీరవాణి గారి వెర్షన్ విన్నాను..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిం..బీజియంస్ యెంతో బావున్నా ద ఫిమేల్ సింగర్ మేడ్ ఇట్ ఎ వాంపిష్ సాంగ్..మోర్ ఓవర్ జయదేవుని శృంగార భక్తిని ఇంత ఘోరం గా ఖూనీ చేయడం చాలా బాధ కలిగించిందండి..రీమిక్స్ అంటే కలోనియల్ కజిన్స్-కృష్ణా నీ బేగనె" లా వుండాలి..

ధన్యవాదాలు తేజస్విగారు.

ఓహో ఈరోజు రెండోరోజా శాంతిగారు నేను ఈవేళ్టినుండే అనుకున్నాను పోస్ట్ అప్డేట్ చేశానండీ ధన్యవాదాలు. మరీ కీరవాణిగారి వర్షన్ ని అంతమాటానేశారేంటండీ బాబు.. మీరు శాస్త్రీయ సంగీతప్రియులైఉంటారు :-))

>నల్లనయ్య, నీలాకాశం, నెమలికన్నులు, నీలి కలువలు, నీలోత్పల కాంతలు, కాంతులు..కలల బృందావనాన్ని కనులముందుంచారు..<

వీడియో గురించి చాలా బాగా చెప్పారు శాంతి గారు.. ధన్యవాదాలు :-) ఈపాటకి తగిన బొమ్మలతో చేశారండీ నాకూ చాలా నచ్చింది. తన ఛానల్ లో ఇంకా మంచి వీడియోలున్నాయి చూడండి. http://www.youtube.com/user/KrsnaMohita/featured

​థాంక్స్ వేణూ.. ఈ పాట మొదట సుశీల గారు పాడింది విని చాలా నచ్చేసింది. తర్వాతా వేరే రకరకాల గాయకులూ పాడిన అష్టపదుల వెర్షన్స్ లో విని చూశాను గానీ ఎందుకో సుశీల గారి పాటంత బాగా ఏదీ అనిపించలేదు. బాలు గారు పాడిన వెర్షన్ ఉందని ఇప్పుడు మీ పోస్ట్ వల్లే తెలిసింది. అది కూడా విన్నాను కానీ ఎందుకో మరి సుశీల గారి పాటకి బాగా అతుక్కుపోయినట్టున్నా.. :-)

ఈ పాటలు అడిగినందుకు మీకే నేను థాంక్స్ చెప్పాలి శ్రావ్యా :-) పోస్ట్ చేస్తూ రెండుపాటలు చాలా ఎంజాయ్ చేశాను.

థాంక్స్ మధురా.. అవును నా ఫస్ట్ ఓటు కూడా సుశీలమ్మ పాడిన పాటకే :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.