శుక్రవారం, డిసెంబర్ 13, 2013

నాజీవిత గమనములో..

రాజన్-నాగేంద్ర గారి బాణీలు సింపుల్ గా ఉంటూనే ఆకట్టుకుంటాయి అద్దాలమేడ సినిమాలోని “నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది” పాట కూడా అటువంటిదే. నాకు చాలా ఇష్టమైన ఈపాట ఎనభైలలో రేడియోలో పరిచయం, అప్పట్లో తెలిసీ తెలియని వయసులో చాలా సీరియస్ గా స్కూల్లోనూ అక్కడక్కడా పాడుకుంటుంటే విన్న మాస్టర్లు బంధువులలో కొందరు పెద్దలు నవ్వుతూ నన్ను ఆటపట్టించడం నాకు ఇంకా గుర్తు :-) ఈ అందమైన పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలని ఉంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : అద్దాలమేడ
సాహిత్యం : దాసరి నారాయణరావు
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : బాలు, జానకి

ఆఆఆఆఆఆఆఆఆఆ
తత్తధీం తఝణూం తఘిట తకిట తఘిటి తకిటి
థా.. ఆఅఆఆఆఆ

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో..ఓ.. ఒక నాయిక పుట్టింది
మది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై.. కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే..ఏ... కావ్యనాయిక

నా జీవిత గమనములో.. ఒక నాయిక పుట్టిందీ..

నేనూ కవిని కానూ..కవిత రాయలేనూ
శిల్పిని కానూ.. నిన్ను తీర్చిదిద్దలేనూ
చిత్రకారుని కానే కాను
గాయకుణ్ణి అసలే కానూ
ఏమీకాని నేను.. నిను కొలిచే పూజారినీ
నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే.. పూజారినీ..
నీ ప్రేమ.. పూజారినీ..

నా జీవిత గమనములో.. ఒక నాయిక పుట్టిందీ..

ఆఆఆఅఆఆఆ....
సగససమపమమ గమగసపనిపప
మపమమనిసనిని పనిస పనిస పనిగా..
ఆఅ..ఆఅ.ఆఆఆఆ...

నేనూ రాముణ్ని కానూ.. విల్లు విరచలేనూ
కృష్ణుణ్ని కానూ.. నిను ఎత్తుకు పోలేనూ
చందురుణ్ని కానే కానూ
ఇందురుణ్ని అసలే కానూ
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదనూ..
అనురాగపు దివ్వెలొ చమురును నింపే.. ఒక పేదనూ..
నే నిరుపేదనూ...

నా జీవిత గమనములో.. ఆఆఆఆఅ ఒక నాయికపుట్టిందీ ఆఆఆఆఅ
మది ఊహల లోకములో కవితలు రాస్తుందీ  ఆఆఆఆఆఅ
ఆ కవిత కావ్యమై..ఆఆఆఅ కావ్యానికి నాయికవై ఆఆఆఆ
వరించి తరించి ఊరించగ రావే.. కావ్యనాయికా

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టిందీ..

2 comments:

యెవరా రాధిక..యేమా కధ వేణూజీ..

హహహ కథ గురించి తెలుసుకోవాలంటే దాసరిగారిని అడగాలి లేదా ఆ సినిమా చూడాల్సిందేనండీ శాంతిగారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.