గురువారం, జనవరి 12, 2012

సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..

ఈ వయసులో విశ్వనాథ్ గారిని బాలూనీ ఇంతగా కష్టపెట్టడం భావ్యమా అని ఒక నిముషం అనిపిస్తుంది కానీ పాట చిత్రీకరణ చూస్తుంటే అవసరమేలే అనిపిస్తుంది. ఆ పరమశివుణ్ణీ అంతటి సమానమైన తన పెద్దదిక్కునీ ఇద్దరినీ గురించి ఒకేసారి చెప్తూ పాడిన ఈ పాట ఒక రెండు సార్లు విన్నాక పల్లవిలోని మొదటి లైన్ హమ్ చేయకుండా ఉండటం దదాపు అసాధ్యం. అంతబాగుంటుంది ఈ పాట. ఆడియో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : దేవస్థానం
సాహిత్యం : స్వరవీణాపాణి
సంగీతం : స్వరవీణాపాణి
గానం : చిత్ర, బాలు

అన్యధా శరణం నాస్తి.. త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వరా..

సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..
సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంట నా వంక చూస్తావా..
నువ్వెక్కబోతే నే నందినౌత నామాట వింటావా ఆఅఆఅ..
 
సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..

ఎవరూలేని ఏకాకైన నాకే నేను పరమశివా
ఎవరూలేని ఏకాకైన నాకే నేను పరమశివా
ఎందుకొచ్చానంటే తెలుసా దేవుడిచ్చాడయ్య వరసా
ఎందుకొచ్చానంటే తెలుసా దేవుడిచ్చాడయ్య వరసా
అమ్మ అయ్య లేని అయ్యలోరు నువ్వనీ..
అమ్మ అయ్య లేని అయ్యలోరు నువ్వనీ
పెద్దయ్యగ చోటియ్యగ నన్నంపినాడా బ్రహ్మయ్యా..

సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..

విధిగీతల్ని గీసేదెవరు తెలుసా నీకు పరమశివా
విధిగీతల్ని గీసేదెవరు తెలుసా నీకు పరమశివా
విన్నపాలందుకోవయ్యా.. అమ్మతోడంట నిజమయ్యా..
విన్నపాలందుకోవయ్యా.. అమ్మతోడంట నిజమయ్యా..
ఏరికోరుకున్న నాకు దిక్కునువ్వయ్యా..
ఏరికోరుకున్న నాకు దిక్కునువ్వయ్యా..
వద్దొద్దయ్య జన్మొద్దయ్య నన్ను చేదుకోరా కోటయ్యా..

సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..
సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..
నువ్వెక్కడుంటే నేనక్కడుంట నా వంక చూస్తావా..
నువ్వెక్కబోతే నేనందినౌత నామాట వింటవా ఆఅఆఅ..
సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..

2 comments:

పాటవిన్నాగాని విషువల్స్ చూళ్ళేదు. ఇప్పుడింకా బాగ నచ్చింది పాట. మొత్తం సాహిత్యం టైప్ చేసి, వీడియో లింక్ జతచేసి పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు, వేణు :-)

Thanks bhaskar :-) yes నాక్కూడా విజువల్స్ చూశాక మరింత నచ్చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.