బుధవారం, జనవరి 06, 2010

శివారెడ్డి మిమిక్రీ వీడియో

నేను ఎపుడైనా రిలాక్స్ అవ్వాలంటే యూట్యూబ్ లో చూసే వీడియోలలో శివారెడ్డి మిమిక్రీ వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం ద్వని అనుకరణకు పరిమితం కాకుండా మ్యానరిజమ్స్ క్యాచ్ చేసి వాటిని అనుకరించడం శివారెడ్డికి ఇంత పేరు రావడానికి కారణం అని నేను అనుకుంటూ ఉంటాను. వజ్రోత్సవాల ఫంక్షన్ లో డ్యాన్సు లతో చూసిన వీడియో అంతా చూసి ఉంటారు. లేదంటే రిలేటెడ్ వీడియోలల్లో అవికూడా దొరకవచ్చు ప్రయత్నించండి. మొదట ఇచ్చినది ప్రముఖులు వీధుల్లో అమ్మకాలు చేపడితే ఎలా ఉంటుంది అనే అంశం దీనిలో కృష్ణం రాజు హైలైట్. ఇక రెండోది రాజకీయ నాయకుల ఎదురుగా వాళ్ళ గొంతులను అనుకరించడం. ఇందులో సత్యన్నారాయణ గారి గొంతు హైలైట్. ఇక మూడోది, ఈ చిచ్చర పిడుగు పేరు నాగేంద్ర అనుకుంటాను, ఇతను కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ గారి కుక్క మిమిక్రి హైలైట్ :-)












9 comments:

కడుపుబ్బా నవ్వుకున్నాం ముఖ్యంగా YSR ఎదురుగా చేసిన కామెడీ చూసి
సో మెనీ THANKS
BHARATH

వేణు, మొదటిది, చివరిది చూసాను, మీరన్న ఆ రెండు అనుకరణలూ తెగ నవ్వుతూ చూసాను. థాంక్స్. అనుకోకుండా రావటం ఇలా నవ్వుకోగలగటం బాగుంది.

భారత్ గారు, ఉష గారు నెనర్లు.

SRRao గారు నెనర్లు. మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

siva reddy ante naku chala istam athani mimicry chala baga untundi- RAGHU VEMPALLI

sivareddy naaku chala istam sivareddy mimicry chala baaga unundi

sivareddy is agreat mimicry artistg-RAGHU

sivareddy is agreat mimicry artistg-RAGHU

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.