గురువారం, జూన్ 26, 2008

అయ్యోలూ..హమ్మోలు..ఇంతేనా!!

మనకున్న సీరియలోఫోబియా !! (అలా హశ్చర్యపడిపోయేస్తే కష్టం, మాయాబజార్ లో్ "ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయ్" అన్న ఘటోత్కచుడ్ని ఆదర్శం గా తీసుకుని నేనే కనిపెట్టా ఈ పదం). సరే ఏదో ఒకటి ఏడూ... అని అనేసారని నాకు వినపడిందిలే. సో మనకున్న సీరియలోఫోబియా తో మొదట్లో ఈ అమృతం సీరియల్ జోలికి వెళ్ళే వాడ్ని కాదు. కానీ కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇంట్లో బలవంతం గా కూర్చో పెట్టేసి చూయించారు.

మొదట్లో నేను చూసిన ఎపిసోడ్స్ లో కామెడీ కధ కన్నా పాటలకి పేరడీ లు కట్టి వెటకారం చేయడం ఎక్కువ ఉండేది కొన్ని ఎంత బాగా నచ్చేవో కొన్ని అంత చిరాకూ తెప్పించేవి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ నచ్చడం మొదలు పెట్టాయి మెల్లగా నేను కూడా Addict అయిపోయాను. మరీ పనులు మానుకుని కాక పోయినా ఆదివారం ఖాళీ వుంటే మాత్రం వదలకుండా చూసే వాడ్ని. మామూలు సాగతీత సీరియల్స్ లా లేకుండా ఇది ఏ వారానికి ఆ వారం చిన్న చిన్న పిట్టకధల లా ఉండటం తో బాగా నచ్చేసింది.

అన్నట్లు ఆదివారం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఇంకా వేస్తున్నాడో లేదో కానీ అప్పట్లో ఈటీవీ లో ఆదివారం రాత్రి 9:30 కి జంధ్యాల గారి సినిమాలు వేసే వాడు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అందులో చాలా సార్లు వేసేవాడు అది టెలికాస్ట్ అయిన ప్రతీ సారీ చూసే వాడ్ని. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని హాస్యం ఆ సినిమాకే సొంతం.

ఇక సిరివెన్నెల గారు రాసిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఎంత ఇష్టమంటే, Just Yellow banner ఈ పాటా, లిటిల్ సోల్జర్స్, ఐతే మూడూ కలిపి CD రిలీజ్ చేస్తే నాకు బెంగళూరు లో దొరకడం లేదు అని హైదరాబాద్ నుండి ఒక ఫ్రెండ్ వస్తుంటే తనతో తెప్పించుకున్నా :-) అంత ఇష్టం అనమాట.

సీరియల్ : అమృతం
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....
ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....

మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....
ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....

వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......
అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....

ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..
hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.
ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా..
గాలైనా రాదయ్యా..నీదసలే ఇరుకు అద్దిల్లు....
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు...

ఒరేయ్ ఆంజినేలు .. తెగ ఆయస పడిపొకు చాలు....
మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc., మన కష్టాలు...
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ.. ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్.

సోమవారం, జూన్ 23, 2008

వాసంత సమీరం లా

ఏవో కొన్ని ప్రోగ్రాం లు, పండగల కి ప్రత్యేకించి తీసిన టెలీఫిల్మ్ లు తప్ప అంత గా ఆకట్టుకోని కార్యక్రమాల మధ్య బాగా ప్రాచుర్యాన్ని పొందిన మొదటి తెలుగు ధారా వాహిక ఋతురాగాలేనేమో. అప్పట్లో నాకు తెలిసి ఆదివారం ఉదయం వచ్చే రామాయణం తర్వాత మా ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లోను ఒకే సమయం లో high volume లో పెట్టుకుని చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. ఋతురాగాలు దూర దర్శన్ లో సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది అనుకుంటాను, స్కూల్ / కాలేజి నుండి ఇంటికి వచ్చే టైము. నాకు ఇంకా బాగా గుర్తు, ఇంటికి వస్తుంటే దారి పొడవునా ప్రతి ఇంట్లోనూ ఈ పాట మార్మోగిపొతుంటుంది. నేను ఈ సీరియల్ ఎప్పుడూ చూడక పోయినా ఈ పాట మాత్రం చెవులు రిక్కించి వినే వాడ్ని. ప్రారంభం లో వచ్చే ఝుం తన నం తననం... వినగానే చాలా హాయిగా అనిపించేది. ఇప్పటికీ ఈ పాట వింటుంటే మనసు అప్పటి ఙ్నాపకాలలోకి వెళ్ళి పోతుంది. అప్పట్లో బాగా పేరుపొందిన కార్యక్రమాలలో చిత్ర లహరి, చిత్ర హార్, చిత్రమాల కూడా వుండేవి. వరుసగా గురు, శుక్ర, ఆది వారాలలో వచ్చేవనుకుంటా.

జెమినీ లో ఈ ధారావాహిక ఇప్పుడు తిరిగి ప్రసారం చేస్తున్నారల్లే వుంది. తెలుగు TV కి access లేని వాళ్ళు ఈ పాట ని ఇక్కడ చూడవచ్చు.

http://www.youtube.com/watch?v=OW_DaYkE-_E



సంగీతం : బంటి, రమేష్
సాహిత్యం : బలపద్ర పాత్రుని మధు
గానం : సునీత, బంటి.

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

ఒక శ్రావణ మేఘం లా
ఒక శ్రావణ మేఘం లా
శరత్చంద్రికల కల లా..

హేమంత తుషారం లా
నవ శిశిర తరంగం లా
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లొ
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లో
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

గురువారం, జూన్ 19, 2008

బండి కాదు మొండి ఇదీ

"అప్పట్లో" అని అంటూ ఈ రోజు పోస్ట్ మొదలు పెడుతుంటే, హఠాత్తుగా "అహ నా పెళ్ళంట" సినిమా లో "మా తాతలు ముగ్గురు..." అని అంటూ ఆటో బయోగ్రఫీ చెప్పే నూతన్ ప్రసాద్ గారు గుర్తొచ్చి నాకే నవ్వు వచ్చింది, నేను కూడా అలా తయారవుతున్నానా అని. అయినా స్వగతం అంటూ బ్లాగడం మొదలు పెట్టాక తప్పదు కదా. అయినా ఇంచు మించు అదే రేంజ్ లో సుత్తి కొట్టినా కనీసం అందులో నూతన్ ప్రసాద్ గారి లా కట్టేసి కూర్చో పెట్టి వినింపించడం లేదు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను :-)

సరే ఇక విషయానికి వస్తే మొన్న ఒక రోజు ఆన్‌లైన్ లో ఏదో న్యూస్ క్లిప్పింగ్ విడియో చూస్తుంటే, దానిలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి చెప్తూ "బండి కాదు మొండి ఇది" పాట ని నేపధ్యం లో వినిపిస్తున్నారు అది వినగానే ఔరా అనిపించింది. దాదాపు 30 యేళ్ళ క్రితం ఆత్రేయ గారు వ్రాసిన ఈ పాట ని ఇంకా వాడుకుంటున్నారు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఈ సమస్య ఇంకా అలానే ఉన్నందుకు విచారించాలా, లేకా అలాంటి ఒక సమస్యని చలోక్తి గా తన పాట లో కలిపి వ్రాసిన ఆత్రేయ గారిని, కల కాలం నిలిచి పోయే స్వరాన్ని ఇచ్చిన యం.యస్.విశ్వనాథన్ గారిని మెచ్చుకోవాలా అనేది అర్ధం కాలేదు. మురళీ మోహన్ గారు నటించిన రామదండు అనే ఈ సినిమాకి బాలచందర్ గారు పర్యవేక్షణ మాత్రమే అని వుంటుంది కాని కధా వస్తువు, టేకింగ్ అంతా ఆయన స్టైలే కనిపిస్తుంది.

ఇంతకీ కొసమెరుపు ఏవిటంటే పెట్రోల్ ధరని పల్లవి లోనే ఉపయోగించినా పాటంతా ఒక పాత డొక్కు కారు తో పడుతున్న పాట్ల గురించి.

నేను చిన్నప్పుడు ఇష్టం గా విన్న పాటలలో ఇదీ ఒకటి....

చిత్రం : రామదండు
సంగీతం : యం.యస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ

బండి కాదు మొండి ఇదీ సాయం పట్టండీ...
పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి...
గోపాలా.. గోవిందా.. రావయ్యా.. లాగయ్యా..

||బండి కాదు||

ఎక్కడికి వెళ్ళాలయ్యా...వెళ్ళినాక చెప్తానయ్యా..
చెప్పకుంటె ఎట్టాగయ్యా... చెప్పుకుంటె తంటాలయ్యా...

||ఎక్కడికి||
||బండి కాదు||

అరె ఇంగ్లాండు మహరాణి ఈ డొక్కు కార్లోనె ఊరేగి వెళ్ళిందటా...హా..
అది చూశాకా మోజెక్కీ మైసూరూ మహరాజ దర్జాగ కొన్నాడటా..
అది ఏలమేసారు నాన్న పాట పాడారు...ఏ గాణి ఇచ్చారు ఏగించుకొచ్చారు
ఇది పుట్టాక ఇట్టాగే నెట్టించు కుంటూంది నెట్టింది ఇన్నేళ్ళటా...||2||
అదే అలవాటు అయ్యిందటా...
అరె ఊగిపోతుందీ...అసలు ఊడిపోతుందీ...
ఒట్టి బొమికెలేనండి...దీన్ని మోసుకెళ్ళండీ...
మీ పెళ్ళిళ్ళు జరగాలి రా... నాయనా...
మీరు ఊరేగి వెళ్ళాలి రా..ఇది జగన్నాధ రధమేను రా...

||ఎక్కడికి||
||బండి కాదు||
గోపాలా.. గోవిందా..రేయ్ నాయ్‌నా గోపాలా..
రా రా సాయం పట్రా..నెట్టు నెట్టు నెట్టు నెట్టు..

అరె కన్నాను పిల్లల్ని అరడజను కోతుల్ని
చిన్నారి సైన్యాన్నీ..పేరెట్టాను రామదండనీ...
అరె లంక కెళ్ళింది... రాణి తోటి వచ్చిందీ...
అరె బ్రిడ్జి కట్టిందీ... ఇంత ఎవరు చేసిందీ..
మా రామదండు నెదిరించి ఏసైన్యం ఏనాడు గెలిచింది బతికిందీ...
హ హా...ఇది ఊరంతా తెలిసిందీ...
ఈ కారు చూడండీ... నకరాలు చేస్తోందీ...
దీనంతు చూడండీ... ఒక్క తోపు తోయ్యండీ...
అరె ఈ కారు కొన్నందుకూ... నేనిందర్ని కన్నందుకూ...
సరిపోయారు తోసేందుకూ....

||ఎక్కడికి||2||

||బండి కాదు||

సోమవారం, జూన్ 16, 2008

తాళి కట్టు శుభవేళ

నిన్నటి జూనియర్ పాట తర్వాత ఈ పాట కూడా బాగా గుర్తొచ్చింది సరే అని పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ప్రభావమో లేకా మిమిక్రీ కి మామూలు గానే అంత క్రేజ్ వుందో తెలీదు కాని, అప్పట్లో మా ఇంట్లో చిన్న టేప్ రికార్డర్ వుండేది దాని లో రక రకాల శబ్దాలు మిమిక్రీ చేయడానికి ప్రయత్నించి రీకార్డ్ చేసే వాడ్ని. చేతి బొటన వేలు, చూపుడు వేలు కి మధ్య వుండే గాడి ని నోటికి perpendicular గా పెట్టుకుని "కూ...చుక్ చుకు" అంటూ వేసే ట్రైన్ కూత, ఇంకా ట్రైన్ రన్నింగ్ సౌండ్ ఒకటి చాలా బాగా వచ్చేది అప్పట్లో. మా చిన్న మామయ్య గారు "నాయనా శుయోధనా" అంటూ శకుని డైలాగులు , ఇంకా వేటగాడు లో రావు గోపాల రావు గారి "గాజు గది గాజు గది అని నువ్వట్టా మోజు పడి..." అనే డైలాగులు భలే చెప్పేవారు.మా నాన్న గారు వింటుండటం తో దాన వీర శూర కర్ణ లో సంభాషణలు, పద్యాలు, ఇంకా సత్య హరిశ్చంద్ర లో పద్యాలు కూడా నాకు బాగా నచ్చేవి. అవి వింటూ వాళ్ళతో పాటు చెప్పుకుంటూ అప్పుడప్పుడూ మా వాయిస్ కూడా రికార్డ్ చేసుకుని వింటూ చాలా సరదాగా గడిపే వాళ్ళం... నాన్న అన్ని రకాలు వినే వాళ్ళు అప్పుడప్పుడూ నాటకాలు వేసిన అనుభవం వుండటం తో అటు పద్యాలు, పాత పాటలు, ఇంకా మాములు మసాలా సినిమా పాటలు, ఇంకా యాదోంకిబారాత్, షోలే, షాన్ లాంటి హిందీ పాటలు కూడా వింటూ వుండే వారు. బహుశా నాకు కోడా అందుకే అన్ని రకాల సంగీతాన్ని ఆస్వాదించ గలగడం అలవాటు అయిందేమో అనిపిస్తుంది ఒకో సారి. అంతులేని కధ <p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Anthuleni+Katha.html?e">Listen to Anthuleni Katha Audio Songs at MusicMazaa.com</a></p>
చిత్రం : అంతులేని కధ
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం యస్ విశ్వనాథన్
గానం : బాలు.
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాలఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే...
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా....
వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను...
కాకులు దూరని కారడవి...
అందులో.. కాలం యెరుగని మానోకటి..
ఆ అందాల మానులో!! ఆ అద్బుత వనంలో!!..
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా....
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా....
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
థుంథుంథుంథుం..థుథుంథుథుం..థుంథుంథుంథుం..థుథుంథుథుం
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా....ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే...
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...
గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా...
Wish you both a happy life... happy happy married life
హి హహ హీ హ హ...హి హి హ హ...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...
చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...

ఆదివారం, జూన్ 15, 2008

జూనియర్.. జూనియర్

ఈ పాట ఇంకా అంతులేని కధ లో మిమిక్రీ పాట నచ్చని చిన్న పిల్లాడు వుండడేమో... ఈ పాట నాకు చాలా ఇష్టం చిన్నపుడు ఈ పాట పదే పదే వినే వాడ్ని కాని తీరా సినిమాకు తీసుకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ పాట వచ్చే సరికి నేను నిద్ర పోయానుట. నిద్ర లేపితే కూడ సరిగా చూడ లేదు అని చెప్పేది అమ్మ. అసలు మనం చిన్నప్పుడు కొంచెం వెరైటీ లెండి. మా ఇంట్లో సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళం. ఒక సారి నేను నిద్ర పోయాక అలానే నన్ను ఎత్తుకుని సెకండ్ షో కి ఏదో రాజుల సినిమా కి తీసుకు వెళ్ళారుట (అక్బర్ సలీం అనార్కలి అనుకుంటా). మనకి సినిమా మధ్యలో మెలకువ వచ్చి కొంచెం సేపు సినిమా చూసి, నాకు నచ్చ లేదు, అసలు నన్ను అడగకుండా ఇలాంటి చెత్త సినిమాకి ఎవరు తెమ్మన్నారు పదండి వెళ్ళిపోదాం అని గొడవ చేస్తే. పాపం మా నాన్న గారు నన్ను ఎత్తుకుని గేట్ కీపర్ స్టూల్ మీద కుర్చుని సరే నువ్వు నా భుజం మీద పడుకుని బయటకి చూడు నేను సినిమా చూస్తాను అని అక్కడే కుర్చుని సినిమా అంతా చూశారుట :-) అలా అప్పుడప్పుడు చాలా పెంకితనం చూపించే వాడ్ననమాట.

సరే ఇంక మన పాట లోకి వస్తే...మాట్లాడే బొమ్మ వుండటం తో చిన్న పిల్లల పాట అని ఓ తెగ సంబర పడి పోయేవాడ్ని కాని నిజానికి పాట ఎంతో లోతైన అర్ధం తో వుంటుంది. అప్పట్లో ఆ అర్ధం తెలిసేది కాదు అనుకోండి. పెద్దైన తర్వాత ఈ సినిమా చూసినప్పుడు కమల్, బాలచందర్, ఆత్రేయ గార్లని మెచ్చుకోకుండా వుండలేకపోయాను. ఆ పాట సాహిత్యం తెలుగు లిరిక్స్ లో పోస్ట్ చేసిన రవి గారికి థాంక్స్ చెప్పుకుంటూ... ఇక్కడ ఇస్తున్నాను.

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Idhi+Katha+Kaadu.html?e">Listen to Idhi Katha Kaadu Audio Songs at MusicMazaa.com</a></p>

చిత్రం : ఇది కధ కాదు
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం.యస్. విశ్వనాథన్
గానం : బాలు, రమోల

జూనియర్.. జూనియర్.. జూనియర్...
Yes Boss
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ||2||
అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ||2||
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ..
గడ్డిపోచా? నేనా? హి హి హి హి..
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు...

ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు...
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు..

జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...

సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా..
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
నీ మొహమురా హి హి హి హి హి...
సాగరమున్నా తీరనిది నీ దాహమురా..
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని ||2||

నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం
No it's bad...
But I am mad...
మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
what పక పక పిక పిక.. హూ...

జూనియర్..ఊ...
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...


చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గసిరాన మండుటెండకై చూసేవు
Boss, Love has no season, not even reason
Shut up
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గిశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ||2||

ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
It is highly idiotic
No boss, it is fully romantic
హ హ హ హ
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా

ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

బుధవారం, జూన్ 04, 2008

కలిసి వుంటే కలదు సుఖము

నేను చిన్నపుడు నరసరావుపేట్ లో ఉండే వాళ్ళం అని చెప్పాను కదా. అమ్మ ట్రైన్ లొ వర్క్ కోసం గుంటూరు వెళ్ళి వచ్చేది, రోజూ రెండు గంటల పైనే జర్నీ పాపం వెళ్ళి రావడానికి. సో లంచ్ కి బాక్స్ తీసుకు వెళ్ళి వచ్చేప్పుడు స్టేషన్ లో నాకు మెలొడీ ఇంకా రక రకాల చాక్లేట్లు తెచ్చేది. అవి ఎంజాయ్ చేసి ఊరికే ఉండకుండా సాయంత్రం అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ తీసుకుని కమల్‌హాసన్ లాగా స్టైల్ కొడుతూ "కలిసి వుంటే కలదు సుఖము" అని మరోచరిత్ర సినిమా లో పాట పాడుతూ బాక్సు మీద దరువు వేస్తూ డాన్సు వెస్తుంటె అమ్మా నాన్న అందరూ చూసి తెగ నవ్వుకునే వాళ్ళు (ఈ పాటలో కమల్ కూడా అలానే సరిత లంచ్ బాక్సు మీద దరువు వేస్తూ పాడాతాడు లెండి). మనకి చిన్నప్పుడు ఇలాంటి కోతి వేషాలు కూడ అలవాటనమాట యంటీఆర్ స్టెప్ లూ, ఏయన్నార్ స్టెప్ లూ కాపీ కొట్టడానికి ప్రయత్నించే వాడిని :-)

సరే కేవలం సినిమా పాటల పేర్లని వుపయోగించి ఆత్రేయ గారు వ్రాసిన ఈ సరదా అయిన పాట వింటుంటే ఓ చిరు నవ్వు బోలెడంత హుషారు వచ్చేస్తాయి ఇప్పటికీ. అలాంటి "కలిసి వుంటే కలదు సుఖమూ" పాట సాహిత్యం ఇక్కడ మనందరి కోసం... మరోచరిత్ర

<p><a href="undefined?e">undefined</a></p>

చిత్రం : మరోచరిత్ర
గానం : బాలూ, రమోలా
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం. యస్. విశ్వనాథన్

కలిసి వుంటే కలదు సుఖము.. కలసి వచ్చిన అదృష్టము
శభాష్ ... అహా.. హ... హ...
కలిసి వుంటే...కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము
కన్నె మనసులూ.. మూగ మనసులూ ఆ..
అ..కన్నె మనసులూ.. మూగ మనసులూ
తేనె మనసులూ.. మంచి మనసులూ

||కలసి||

మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి... ఆ ఛీ! ఏం కాదు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి
అమెరిక అమ్మాయీ రోజులు మారాయి
ఆఆ డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

మంచి వాడు మామకు తగ్గ అల్లుడు.. ఓ అలాగా..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...హ హ అయ్యొ పిచ్చి వాడు
ఏయ్.. మంచి వాడు మామకు తగ్గ అల్లుడూ..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...
ఈడు జోడు తోడూ నీడా నాడు నేడూ ||2||
ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు... హమ్మ బాబొయ్
డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.