మంగళవారం, సెప్టెంబర్ 26, 2017

కంచి కామాక్షి మధుర మీనాక్షి...

శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులను కరుణించనున్న దుర్గమ్మకు నమస్కరించుకుంటూ ఈ రోజు మధుర మీనాక్షి చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మధురమీనాక్షి (2011)
సంగీతం : రాజవంశీ
సాహిత్యం : డాడీ శ్రీనివాస్
గానం : గీతామాధురి

కంచి కామాక్షి మధుర మీనాక్షి
మమ్ము పాలించవే దేవీ
కనక మాలక్ష్మి సిరుల శ్రీలక్ష్మి
పూజ తిలకించవే దేవీ

కరుణించా భక్తులకు నువ్వు కనిపించు
నడిపించు కోటి వరములు కురుపించు
ఆడపడుచుల ఆరాధ్య దైవానివే
ఏడేడు లోకాలు ఏలేటి మా తల్లివే

ఆదిశక్తి నువ్వే మా విజయలక్ష్మి నువ్వే
చాముండి దేవి నువ్వే ఓంకార శక్తి నువ్వే
నీ గర్భగుడిలో చేరాములే
నీ పూజతో పులకించాములే
పసుపు కుంకుమతో మమ్ము దీవించవే
నీ పాద సేవలో నిలువెల్ల కరిగాములే

కంచి కామాక్షి మధుర మీనాక్షి
మమ్ము పాలించవే దేవీ
కనక మాలక్ష్మి సిరుల శ్రీలక్ష్మి
పూజ తిలకించవే దేవీ


పూలతేరుపైన పయనించు అన్నపూర్ణ
ధాన్యలక్ష్మి లాగా మా ఇంట చేరవమ్మా
అష్టైశ్వర్యములతో మము చేరవే
మా కనుల కాంతులు వెలిగింఛవే
ఆడపడుచుల ఆరాధ్య దైవానివే
పదునాలుగు భువనాల పైనుండి దీవించవే

కంచి కామాక్షి మధుర మీనాక్షి
మమ్ము పాలించవే దేవీ
కనక మాలక్ష్మి సిరుల శ్రీలక్ష్మి
పూజ తిలకించవే దేవీ

 

సోమవారం, సెప్టెంబర్ 25, 2017

అమ్మా నీవు కన్నవారింట...

ఈ రోజు లలితా త్రిపుర సుందర దేవి అలంకారంలొ అమ్మవారిని అర్చించుకుంటూ శ్రీ గౌరీ మహత్యం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ గౌరీ మహత్యం (1956)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు / టి.వి.రాజు
సాహిత్యం : మల్లాది
గానం : లీల 

అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
చూపే ఠీవీ చూసే చూపు 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా అమ్మా 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా

అమ్మా నీవు అంగజ వైరీ ఈఈఈఈ.. 
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి 
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి
లీలగ మేలుగా లోకాలన్నీ 
లీలగ మేలుగా లోకాలన్నీ
ఏలే .. ఆ.. చిద్విలాసం

చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా అమ్మా
చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా
 
అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన 
అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన
మేనులొకటై ఆదమరచి 
మేనులొకటై ఆదమరచి 
వేడుకగా చేసే నాట్యం 

చూడాలమ్మా కనుపండువుగా

 

ఆదివారం, సెప్టెంబర్ 24, 2017

జయ జయ మంగళ గౌరీ...

అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని అర్చించుకుంటూ ఈ రోజు సారంగధర చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


 చిత్రం : సారంగధర (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : పి.లీల

జయ జయ మంగళ గౌరీ
జయ జయ శంకరి కౌమారీ
జయ జయ మంగళ గౌరీ
జయ జయ శంకరి కౌమారీ
జయ జయ మంగళ గౌరీ

నీవే జగతికి కారణమమ్మా
పరదేవతవూ నీవేనమ్మా
నీవే జగతికి కారణమమ్మా
పరదేవతవూ నీవేనమ్మా
నీవే మా ఇలవేలుపువమ్మా
నీవే మా ఇలవేలుపువమ్మా
దయగొనవమ్మా అమ్మా..

జయ జయ మంగళ గౌరీ

చల్లని నీ కనుసన్నలలోనా
కొనసాగును మా కోరికలన్నీ
చల్లని నీ కనుసన్నలలోనా
కొనసాగును మా కోరికలన్నీ
నిలబడవే మా వెన్నుకాపుగా
నిలబడవే మా వెన్నుకాపుగా
జయమునొసంగవే సర్వ మంగళా
జయమునొసంగవే సర్వ మంగళా

జయ జయ మంగళ గౌరీ
జయ జయ శంకరి కౌమారీ
జయ జయ మంగళ గౌరీ 


శనివారం, సెప్టెంబర్ 23, 2017

జయ మంగళ గౌరీ దేవి...

ఈ రోజు గాయత్రి దేవి అవతారంలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముద్దుబిడ్డ (1956)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి. లీల

జయ మంగళ గౌరీ దేవి
జయ మంగళ గౌరీ దేవి
దయ చూడుము చల్లని తల్లీ
జయ మంగళ గౌరీ దేవి

కొలిచే వారికి కొరతలు లేవు
కలిగిన బాధలు తొలగ జేయు
కాపురమందున కలతలు రావు
కమ్మని దీవెనలిమ్మా.. అమ్మా..

జయ మంగళ గౌరీ దేవి
దయ చూడుము చల్లని తల్లీ
జయ మంగళ గౌరీ దేవి

ఇలవేలుపువై వెలసిన నాడే
నెలకొలిపావు నిత్యానందం
ఆ ఆ ఆ ఆ ఆ .....
నెలకొలిపావు నిత్యానందం
నోచే నోములు పండించావు
చేసే పూజకె కొమ్మా.. అమ్మా..

జయ మంగళ గౌరీ దేవి

గారాబముగా గంగ నీవు
బొజ్జ గణపతిని పెంచిరి తల్లీ
ఇద్దరి తల్లుల ముద్దులపాపకి
బుద్దీ జ్ఞానములిమ్మా.. అమ్మా..

జయ మంగళ గౌరీ దేవి
దయ చూడుము చల్లని తల్లీ
జయ మంగళ గౌరీ దేవి
 

శుక్రవారం, సెప్టెంబర్ 22, 2017

శ్రీమించు మా తల్లి...

బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని తలుచుకుంటూ ఈ రోజు శ్రీ గౌరీ మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ గౌరీ మహత్యం (1956)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు / టి.వి.రాజు
సాహిత్యం : మల్లాది
గానం : సుశీల, రావు బాలసరస్వతి

శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ

శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ

మా పసుపు కుంకుమా చల్లగా ఉండ
మా ఐదువతమ్ము చల్లగా ఉండ
కన్నె పేరంటాళ్ళ కళ్యాణ రేఖ
ఇల్లాళ్ళ నొసటాను సౌభాగ్య రేఖ
మా అమ్మ మా తల్లి మంగళా గౌరీ
శ్రీ కరి వర దాయిని సరసిజవదనా
సామజగమనా సదయా మాం పాలయ
శ్రావణ మాసాన మంగళా వారాన
మా యింట వెలసిన మంగళా గౌరీ..

శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ

భక్తితో తోరమ్ము ముంజేత గట్టీ
చిత్తశుద్ధిగ నిన్ను సేవించుకొన్న
ఆపదలలో మునిగి అల్లాడువారు
అంబ నీ దయ వల్ల గడచి బ్రతికేరు
ఆలికీ మగనికీ యెడబాటులైన
అంబ నీ కృప వల్ల ఏకమౌతారు
ఏ నోము మానినా నీ నోము మానము
ఏ వ్రతం తప్పినా నీ వ్రతం తప్పము 

శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ

మంగళ గౌరమ్మ వ్రత కథ వినండి 
ఆ దేవి మహిమలు ఆలకించండి 
ఆది కాలమునాడు అనగనగ ఒక రాజు 
ఆ రాజు పెద భార్య అతి పుణ్యశాలీ
మంగళా గౌరీ నే కోరి కొలువంగ 
ఆ అంబ కరుణించి ఇచ్చె కూతురుని 
ఆ బాల పేరే మంగళా గౌరీ 
ఆ బాల పేరే మంగళా గౌరీ 
ఆ తల్లి సుగుణాలే అబ్బె బాలకునూ

అంబా మంగళ గౌరీ 
జగదంబా దేవీ శ్రీభవానీ
అంబా మంగళ గౌరీ 
జగదంబా దేవీ శ్రీభవానీ
అంబా మంగళ గౌరీ  
 
దరి చేరిన వారిని బ్రోవ 
ఇల నీ సరి వేలుపు లేరే
దరి చేరిన వారిని బ్రోవ 
ఇల నీ సరి వేలుపు లేరే
ఇది నీ పరివారమే దేవదేవీ 
కనుపాపగ పాపను కాపాడవే

అంబా మంగళ గౌరీ 
జగదంబా దేవీ శ్రీభవానీ 
అంబా మంగళ గౌరీ 

భవతాపము తీరే వెరవు 
వరయోగులు కోరే తెరవు
భవతాపము తీరే వెరవు 
వరయోగులు కోరే తెరవు
నగరాజ కుమారీ నీవె కావా 
శరణం భవ మాం పాహి పురాణి  
 
అంబా మంగళ గౌరీ 
జగదంబా దేవీ శ్రీభవానీ 
అంబా మంగళ గౌరీ 

 

గురువారం, సెప్టెంబర్ 21, 2017

కరుణించవే తులసిమాత...

ఈ రోజు నుండీ దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న సంధర్బంగా స్వర్ణకవచాలంకృతా దేవి అవతారంలో దర్శనమీయనున్న అమ్మవారిని స్మరిస్తూ శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని ఈ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : దాశరధి
గానం : జానకి, సుశీల

కరుణించవే తులసిమాత
కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా
కరుణించవే తులసిమాత

నిన్నే కోరి పూజించిన సతికీ
కలుగుకాదే సౌభాగ్యములన్ని
నిన్నే కోరి పూజించిన సతికీ
కలుగుకాదే సౌభాగ్యములూ

కరుణించవే తులసిమాత
కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా
కరుణించవే....దీవించవే..
పాలించవే..తులసిమాత

వేలుపురాణి వాడని వయసు
వైభవమంతా నీ మహిమేగా
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
వేలుపురాణి వాడని వయసు
వైభవమంతా నీ మహిమేగా

అతివలలోనా అతిశయమందే
భోగమందీయ్యవే
కరుణించవే కల్పవల్లీ
కరుణించవే కల్పవల్లీ
దీవించవే తల్లీ.. మనసారా
కరుణించవే దీవించవే
పాలించవే కల్పవల్లీ

నిదురనైనా నా నాధుని సేవా
చెదరనీక కాపాడగదే
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
నిదురనైనా నా నాధుని సేవా
చెదరనీక కాపాడగదే

కలలనైనా గోపాలుడు నన్నే
వలచురీతి దీవించగదే
కలలనైనా గోపాలుడు నన్నే
వలచురీతి దీవించగదే

కరుణించవే కల్పవల్లీ
కరుణించవే తూలసిమాత

దీవించవే తల్లీ మనసారా
కరుణించవే... దీవించవే
పాలించవే... తులసిమాత 

 

బుధవారం, సెప్టెంబర్ 20, 2017

టక్కరిదానా టెక్కులదానా..

విమల చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విమల (1960)
సంగీతం : ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు
సాహిత్యం : ముద్దుకృష్ణ
గానం : పిఠాపురం, జమునారాణి 

టక్కరిదానా టెక్కుల దానా
టక్కరిదానా టెక్కుల దానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే

తుంటరి రాజా తింటావు కాజా
తుంటరి రాజా తింటావు కాజా
ఒంటిగా చేసి కొంటెంగా చూసి వెంటను పడతావా

మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
ఇక బూటకమాడి నాటకమాడే వాటము చాలోయి
 బూటకమాడి నాటకమాడే వాటము చాలోయి
తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు కాజా

టక్కరి టక్కరి టక్కరి టక్కరి దానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల దానా

చీరలు ఇస్తా సారెలు తెస్తా చిర్రుబుర్రుమనకే
చీరలు ఇస్తా సారెలు తెస్తా చిర్రుబుర్రుమనకే
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
టక్కరి టక్కరి టక్కరి టక్కరి దానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల దానా

చీరలు ఏల గారెలు ఏల బేరాల మాటేలా
చీరలు ఏల గారెలు ఏల బేరాల మాటేలా
నే కోరిన వాడే చేరువ కాగా కొరత ఇంకేలా
కోరిన వాడే చేరువ కాగా కొరత ఇంకేలా
తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు కాజా

బూరెలు చేస్తా గారెలు చేస్తా బూంది చేస్తానే
బూరెలు చేస్తా గారెలు చేస్తా బూంది చేస్తానే
వద్దనను మన పెళ్ళికి నేనే వడ్డన చేస్తానే
వద్దనను మన పెళ్ళికి నేనే వడ్డన చేస్తానే

టక్కరిదానా టెక్కుల దానా
టక్కరిదానా టెక్కుల దానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే


మంగళవారం, సెప్టెంబర్ 19, 2017

అట్లాంటి ఇట్లాంటి హీరోని...

చంటబ్బాయ్ చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చంటబ్బాయ్ (1986)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ 

అట్లాంటి ఇట్లాంటి హీరోని కాదు నేను 
మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు 
స్విస్సు మిస్సునే సిటీబస్సులో 
కిస్సు చేసిన హీమాన్ ని
ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా 
డాన్సు చేసిన మొనగాడ్నీ 
లాస్యానికి డాల్ఫిన్నీ హాస్యానికి చాప్లిన్నీ 
నే ఛార్లీ ఛాప్లిన్ ని

నార్వేలోనీ నారీమణుల గుండెల దాగిన ఖైదీనీ 
చల్లపల్లి లో పిల్లిపిల్లలా దొరికిపోయిన ఖైదీవా 
హాంకాంగ్ లో కింగ్ కాంగ్ నే తలదన్నినా మగధీరుడ్నీ 
బందరులోనా బల్లిని చూసీ బావురుమన్నా మగధీరుడివా 
నా భాషకు గ్రామర్ హ్యూమర్ 
నా ఫేసుకు గ్లామర్ హ్యూమర్ 
ఇది ఎవరూ నమ్మని రూమర్ 
ఇక వెయ్యకు నాకీ హ్యామర్ 
నే ఛార్లీ ఛాప్లిన్ నీ

అట్లాంటి ఇట్లాంటి హీరోని కాదు నేను 
మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు 
స్విస్సు మిస్సునే సిటీబస్సులో 
కిస్సు చేసిన హీమాన్ ని
ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా 
డాన్సు చేసిన మొనగాడ్నీ 
లాస్యానికి డాల్ఫిన్నీ హాస్యానికి చాప్లిన్నీ 
నే ఛార్లీ ఛాప్లిన్ నీ

సిడ్నీ వెళ్ళి కిడ్నీ తీసి దానమిచ్చిన విజేతనూ 
వడ్లపూడి ఇడ్లీపోటీలో ఓడిపోయినా విజేతవా 
మాస్కోడిస్కో ఒలింపిక్స్ లో కాస్కోమన్నా రాజునీ 
మగ మహారాజునీ
మంగళగిరిలో మహిళామండలి అధ్యక్షతకే అర్హత ఉన్న 
మగువరాజువా మగ మహారాజువా 
నా కంటికి రెప్పలు కామెడీ 
నా ఒంటికి ఊపిరి కామెడీ
వనమంతా చెరిచెను తాచెడీ.. డీడీడీ
అది కోతికి చెందిన ట్రాజెడీ...డీడీడీ
నే ఛార్లీ ఛాప్లిన్ నీ

అట్లాంటి ఇట్లాంటి హీరోని కాదు నేను 
మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు 
స్విస్సు మిస్సునే సిటీబస్సులో 
కిస్సు చేసిన హీమాన్ ని
ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా 
డాన్సు చేసిన మొనగాడ్నీ 
లాస్యానికి డాల్ఫిన్నీ హాస్యానికి చాప్లిన్నీ 
నే ఛార్లీ ఛాప్లిన్ ని

 

సోమవారం, సెప్టెంబర్ 18, 2017

ఏమిటి ఈ అవతారం...

చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం

చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా

ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం

దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు 

ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం

 

ఆదివారం, సెప్టెంబర్ 17, 2017

బాగు చెయ్ నను గోవిందా...

ఖడ్గం చిత్రంలోని ఒక సరదాపాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఖడ్గం (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : విజయకుమార్
గానం : శ్రీ

గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...

నుదిటిరాతలు మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా
స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూ నీడా

గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
అరె బాగు చెయ్ నను గోవిందా... బాగు చెయ్ నను గోవిందా...
జూబ్లిహిల్స్ లో బంగ్లా ఇవ్వు...లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు
హైజాక్ అవ్వని ఫ్లైటొకటివ్వు...వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ

గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా
పై తియ్ నను గోవిందా
గోవిందా... గోవిందా...

పెట్రోలడగని కారు ఇవ్వు...బిల్లు అడగని బారు ఇవ్వు
కోరినంత ఫూడ్డు పెట్టి డబ్బులడగని హోటల్ ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకరు పోస్టో.. రాజ్యసభలో ఎం.పీ సీటో
పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాములా సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు...లాసుకాని షేరులివ్వు
సింగిల్ నంబరు లాటరీలివ్వు
టాక్సులడనగి ఆస్తులివ్వు...

పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి 
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ

గో... గో... గో...
గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా

వందనోట్ల తోటలివ్వు...గోల్డు నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాసు హీరో చాన్సులివ్వు......హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టుడియో ఇవ్వు...స్విస్సు బాంకులో బిలియన్లివ్వు
కోట్లు తెచ్చే కోడుకులనివ్వు... హీరోలయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా సీ.ఎం చెయ్యి.. లేకపోతే పీ.ఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోనీ లైఫు నివ్వు

గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
బాగు చెయ్ నను గోవిందా
బాగు చెయ్ నను గోవిందా
పైకి తే నను గోవిందా
గోవిందా... గోవిందా...

లక్కుమార్చి నను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏ.సీ చేస్తా...
ఎయిత్ వండరు నీ గుడి చేస్తా...
గో గో గో గోవిందా... గోవిందా...

అయ్ బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి..


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail